క్రీడాభూమి

మ్యాచ్‌ల తరలింపు పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 10: మహారాష్టల్రో నెలకొన్న నీటి ఎద్దడి, కరవు పరిస్థితులకు ఐపిఎల్ మ్యాచ్‌ల తరలింపు పరిష్కారం కాబోదని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు నాయకత్వం వహిస్తున్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. ఆదివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ మహారాష్టల్రోని కరువు పరిస్థితి పట్ల ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారని అన్నాడు. అయితే, ఐపిఎల్ మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించనంత మాత్రాన కరవు పరిస్థితులు తొలగిపోతాయా అని ప్రశ్నించాడు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. నీటి ఎద్దడిని నివారించడానికి, కరవును ఎదుర్కోవడానికి తాత్కాలిక చర్యల వల్ల లాభం ఉండదన్నాడు.
అశ్విన్ సమర్థుడు..
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సమర్థుడని, ఎన్నో సందర్భాల్లో జట్టును ఆదుకున్నాడని ధోనీ అన్నాడు. శనివారం డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో అశ్విన్‌ను 16వ ఓవర్‌లో బరిలోకి దించడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు అతను సమాధానమిస్తూ, ఎప్పుడైనా బౌలింగ్ చేయడానికి అశ్విన్ సిద్ధంగా ఉంటాడని అన్నాడు. మ్యాచ్ ప్రారంభంలో, కొత్త బంతితో అతను బౌలింగ్ చేసిన సందర్భాలున్నాయని అన్నాడు. అదే విధంగా స్లాగ్ ఓవర్లలోనూ అతను రాణించగలడని చెప్పాడు. జట్టు అవసరాలను, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒక బౌలర్‌ను రంగంలోకి దింపుతామని, ఇది జట్టు వ్యూహ రచనలో భాగమని తెలిపాడు.