క్రీడాభూమి

డోప్ పరీక్షలు.. డైట్‌లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 10: కామనె్వల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రతిభ కనబరచడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న చర్చ ఇది. ఒకప్పుడు డోపింగ్ పరీక్షల్లో పట్టుబడిన లిఫ్టర్ల కారణంగా పరువు పోగొట్టుకొని, ఒకానొక దశలో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య ఆగ్రహానికి గురైన భారత వెయిట్‌లిఫ్టింగ్ రంగం ఇంత త్వరగా ఎలా కోలుకుంది? ఒక్క డోప్ కేసు కూడా లేకుండా క్లీన్ చిట్ సంపాదించుకోవడానికి ఏ విధంగా కృషి చేసింది? ఫిట్నెస్ సమస్యలు ఉన్నప్పటికీ, భారత లిఫ్టర్లు పతకాలు పంటను కొనసాగించడం వెనుక దాగివున్న రహస్యమేమిటి? ఈ ప్రశ్నలకు వెయిట్‌లిఫ్టింగ్ జాతీయ కోచ్ విజయ్ శర్మ విస్పష్టమైన వివరణ ఇచ్చాడు. క్రమం తప్పకుండా డోపింగ్ పరీక్షలను నిర్వహించడం, డైట్‌లో మార్పులు చేయడం వంటి అంశాలే భారత లిఫ్టర్ల విజయ రహస్యమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. కామనె్వల్త్ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 16 స్వర్ణాలు, 16 రజతాలు, మరో 16 కాంస్యాలు (మొత్తం 48) పతకాల కోసం జరిగిన పోరాటంలో భారత్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, మరో రెండు కాంస్యాలతో మొత్తం తొమ్మిది పతకాలను కైవసం చేసుకొని, ఈ విభాగంలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. సుమోవా (రెండు స్వర్ణాలు, రెండు రజతాలు), మలేసియా (రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ నుంచి కామనె్వల్త్‌లో 12 మంది వెయిట్‌లిఫ్టర్లు పోటీపడ్డారు. వీరిలో ఆరుగురు మహిళలుకాగా, ఆరుగురు పురుషులు. పనె్నండు మందికిగాను తొమ్మిది మంది పతకాలు కైవసం చేసుకోవడం విశేషం. తమతమ విభాగాల్లో విజేతలుగా నిలిచిన మీరాబాయ్ చాను (48 కిలోలు), సంజిత చాను (53 కిలోలు), పూనమ్ యాదవ్ (69 కిలోలు), సతీష్ శివలింగం (77 కిలోలు), వెంకట రాహుల్ రాగాల (85 కిలోలు) స్వర్ణ పతకాలు గెల్చుకున్నారు. పూజారి గురురాజ్ (56 కిలోలు), ప్రదీప్ సింగ్ (105 కిలోలు) రజత పతకాలను సాధించగా, వికాస్ ఠాకూర్ (94 కిలోలు), 18 ఏళ్ల యువ సంచలనం దీపక్ లాథర్ (69 కిలోలు) కాంస్య పతకాలు అందించారు. బుధవారం న్యూఢిల్లీ చేరుకోనున్న వెయిట్‌లిఫ్టింగ్ బృందానికి ఘన స్వాగతం పలికేందుకు అధికారులు, అభిమానులు సిద్ధమయ్యారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు తొమ్మిది పతకాలు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్న అందరినీ ఉత్కంఠకు గురి చేస్తున్నది. అయితే, 2012 నుంచి భారత లిఫ్టర్లతో దగ్గరి సంబంధాలున్న విజయ్ శర్మ 2014లో చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. ఎప్పటికప్పుడు డోప్ పరీక్షలు నిర్వహించడం అందులో ఒకటి. గత నాలుగఏళ్లుగా, ఏటా ఐదు వందలకు మించి డోప్ పరీక్షలు జరిపిస్తున్నాడంటే, వెయిట్‌లిఫ్టింగ్‌లో మరోసారి ఉత్రేరకాలు వాడకం చోటు చేసుకోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో స్పష్టమవుతుంది. ప్రతి లిఫ్టర్‌పై ప్రత్యేక దృష్టిని సారించి, వారిని ప్రోత్సహిస్తూ, అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన పునాదులు వేస్తున్నాడు. వీటికితోడు, లిఫ్టర్ల డైట్‌ను విజయ్ శర్మ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)లో శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన ఆహారాన్ని అక్కడి మెస్ అందిస్తున్నది. అయితే, లిఫ్టర్లకు ప్రత్యేకమైన ఆహారం ఉండాలని విజయ్ శర్మ పట్టుబట్టాడు. డైట్‌లో ఎన్నో మార్పులు చేశాడు. జర్మనీ నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్న ఫుడ్ సప్లిమెంట్స్‌ను ఇస్తున్నాడు. పౌష్టికాహారం ప్రతి లిఫ్టర్‌కూ అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విజయ్ శర్మ కృషికి లిఫ్టర్లు కూడా సహకరించడంతో, కామనె్వల్త్ గేమ్స్‌లో పతకాలు కొల్లగొట్టడం సాధ్యమైంది. మిగతా క్రీడల్లోనూ కోచ్‌లు ఇదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటే, రాబోయే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో భారత్ ఎక్కువ పతకాలను సాధించే అవకాశాలు లేకపోలేదు.