క్రీడాభూమి

నిర్వాహకుల నిర్వాకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 10: నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఒక సైక్లిస్టు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కామనె్వల్త్ గేమ్స్‌లో పోటీపడే అవకాశాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్‌కు చెందిన మెలిస్సా లోథర్ ఈసారి కామనె్వల్త్ గేమ్స్ ఇండివిజువల్ టైమ్ ట్రయల్‌లో పోటీపడాల్సి ఉండింది. అయితే, బరిలో ఉన్న సైక్లిస్టుల జాబితాలో అధికారులు ఆమె పేరును చేర్చలేదు. సాంకేతికపరమైన సమస్య కారణంగా ఆమె పేరు జాబితాలో కనిపించలేదంటూ నిర్వాహకులు ప్రకటించారు. అందుకు క్షమాపణ కూడా చెప్పారు. కానీ, నిబంధనల ప్రకారం జాబితాలో పేరు లేని వారిని పోటీకి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. దీనితో, చేసేదేమీ లేక క్రీడా గ్రామంలోని తాను బస చేసిన గదికే పరిమితం కావాల్సి వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కామెంట్స్‌లో లోథర్ పేర్కొంది. ఎంతోకాలంగా కామనె్వల్త్ గేమ్స్ కోసం ఎదురుచూస్తున్నానని, దేశానికి ప్రాతినిథ్యం వహించడమేగాక, పతకాన్ని కూడా సాధించిపెట్టాలని అనుకున్నానని ఆమె తెలిపింది. ఈ పోటీల కోసం ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేశానని, కానీ, తన ప్రమేయం లేకుండానే పోటీకి హాజరుకాలేకపోయానని వాపోయింది. మొత్తం మీద నిర్వాహకుల నిర్వాకం కామనె్వల్త్‌లో పాల్గొనాలన్న ఓ యువ సైక్లిస్టు ఆశలకు గండికొట్టింది. ఆమెను పోటీ నుంచి దూరం చేసింది.

చిత్రం..మెలిస్సా లోథర్