క్రీడాభూమి

హర్మన్‌ప్రీత్ ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 10: కామనె్వల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. మంగళవారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకొని, సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్టు హర్మన్‌ప్రీత్ సింగ్ చేసిన రెండు గోల్స్ భారత్‌ను విజయపథంలో నడిపించాడు. మ్యాచ్ ఆరంభమైన వెంటనే మలేసియాపై విరుచుకుపడిన భారత్‌కు మూడో నిమిషంలోనే హర్మన్‌ప్రీత్ గోల్‌ను అందించాడు. ఆతర్వాత భారత ఆటగాళ్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, గోల్స్ కోసం మలేసియా దాడులకు ఉపక్రమించింది. 16వ నిమిషయంలో వారి ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఫైజల్ సరీ ఆ జట్టుకు ఈక్వెలైజర్‌ను సంపాదించిపెట్టాడు. అనంతరం గోల్స్ కోసం ప్రయత్నించకుండా, ఇరు జట్లు డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చాయి. ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురవుతున్న తరుణంలో హర్మన్‌ప్రీత్ మరోసారి సత్తా చాటాడు. 44వ నిమిషంలో అతను కీలక గోల్ చేసి, భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆతర్వాత భారత రక్షణ విభాగం ఎంతో జాగ్రత్తగా ఆడుతూ, మలేసియాకు గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండానే మ్యాచ్‌ని ముగించి, సెమీస్ చేరింది.

చిత్రం..హర్మన్‌ప్రీత్ సింగ్