క్రీడాభూమి

ఒక్క ఓవర్లో ఏడు బంతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: క్రికెట్‌లో అంపైర్ నిర్ణాయమే ప్రధానం. అలాంటి అంపైర్ తప్పులు చేస్తే ఎలా? సోమవారం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఘోర తప్పిదం చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ పేస్‌బౌలర్ బెన్ లాగ్లిన్ ఓవర్‌లో ఏడు బంతులు వేశాడు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 12వ ఓవర్లో బెన్ లాగ్లిన్ ఏడు బంతులు వేసిన్నప్పటికీ ఎవరూ గమనించలేదు. సాధారణంగా నో బాల్స్, వైడ్స్ వేసినపుడు మాత్రమే ఎక్కువ బంతులు విసరడం చూస్తూ ఉంటాం. అధికారికంగా మాత్రం వాటిని మినహాయించి ఓవర్‌లో ఆరు బంతులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అయితే వాటికి ఆస్కారం లేకుండానే అంపైర్ ఏడు స్ట్రైట్ బంతుల్ని వేయడానికి ఆవకాశమిచ్చాడు. ప్రస్తుతం దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఏడు బంతులు వేయడం పెద్ద నేరమని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. ఈ సంఘటనతో సన్‌రైజర్స్ జట్టు 25 బంతులు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఈ విషయం మరుగునపడింది. ఒకవేళ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగితే మాత్రం దీనిపై పెను దుమారమే చెలరేగేదని విశే్లషకులు పేర్కొంటున్నారు. ఓవరాల్‌గా ఇది అతి పెద్ద తప్పిదంగా వారు అభిప్రాయపడుతున్నారు. బౌలర్ బెన్ వేసిన ఏడు బంతుల్లో తొలి బంతిలో విలియమ్‌సన్ నో రన్, రెండో బంతిలో విలియమ్ సన్ సింగిల్, మూడో బంతిలో ధావన్ నో రన్, నాలుగో బంతిలో ధావన్ సింగిల్, ఏదో బంతిలో విలియమ్ సన్ సింగిల్, ఆరో బంతిలో ధావన్ ఫోర్, ఏడో బంతిలో ధావన్ సింగిల్ సాధించాడు.