క్రీడాభూమి

పురుషుల హాకీ ఫైనల్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: కామనె్వల్త్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు టైటిల్ వేటను కొనసాగిస్తున్నది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌తో చివరి వరకూ పోరాడి, 4-3 తేడాతో విజయం సాధించి, ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇరు జట్ల ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డి గోల్స్ కోసం ప్రయత్నించడంతో, ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మ్యాచ్ 17వ నిమిషంలోనే ఇంగ్లాండ్‌కు డేవిడ్ కాండన్ ద్వారా తొలి గోల్ లభిస్తే, 33వ నిమిషంలో భారత్‌కు మన్‌ప్రీత్ సింగ్ ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆధిపత్యం కోసం శ్రమించాయి. ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకోవడంతో కొంత సేపు గోల్స్ నమోదుకాక, ఉత్కంఠ ఫరిస్థితి నెలకొంది. ఈ ఉత్కంఠకు 51వ నిమిషంలో రూపీందర్ పాల్ సింగ్ తెరదించాడు. అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో ఆకట్టుకున్న అతను భారత్‌ను 2-1 ఆధిక్యానికి చేర్చాడు. కానీ, ఆ ఆనందం అతనికి ఎక్కువ సేపు నిలవలేదు. మరో నిమిషం వ్యవధిలోనే లియామ్ ఆనె్సల్ గోల్ సాధించాడు. దీనితో తిరిగి ఇరు జట్లు సమవుజ్జీగా నిలిచాయి. మరో నాలుగు నిమిషాల తర్వాత సామ్యూల్ వార్డ్ గోల్ సాధించి, ఇంగ్లాండ్‌కు 3-2 ఆధిక్యాన్ని అందించాడు. దీనితో కంగుతిన్న భారత్ ఎదురుదాడికి దిగింది. మరో మూడు నిమిషాల్లోనే వరుణ్ కుమార్ గోల్ చేయడంతో, మరోసారి స్కోరు సమమైంది. ఈ గోల్ లభించిన నిమిషానికే మన్దీప్ సింగ్ చేసిన గోల్ భారత్‌కు 4-3 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టింది. ఆతర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు గోల్స్ చేయకుండా జాగ్రత్త పడిన భారత్, అదే తేడాతో విజయాన్ని నమోదు చేసి, ఫైనల్‌కు దూసుకెళ్లింది.