క్రీడాభూమి

హిమ శ్రమ వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: భారత టీనేజ్ సంచలనం హిమ దాస్ పతకం కోసం చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. కామనె్వల్త్ గేమ్స్ మహిళల 400 మీటర్ల పరుగులో ఆమె తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసినప్పటికీ, ఆరో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. మంళవారం నాటి సెమీ ఫైనల్స్‌లో లక్ష్యాన్ని 51.53 సెకన్లలో చేరుకొని, స్వదేశంలో తన ఉత్తమ ప్రదర్శనను అధిగమించింది. మెడల్ రన్‌లో అంతకంటే మెరుగ్గా రాణించి, 51.32 సెకన్లలోనే రేస్‌ను పూర్తి చేసింది. అయితే, ‘మినీ ఒలింపిక్స్’ కామనె్వల్త్ గేమ్స్ స్థాయి పోటీల్లో అది పతకాన్ని సంపాదించడానికి పనికిరాదని స్పష్టమైంది. అమాంటెల్ మొన్షో (బోత్వ్సానా/ 50.14 సెకన్లు), అనస్టాసియా లీ రాయ్ (జమైకా/ 50.57 సెకన్లు), స్టెఫెనీ మెక్‌ఫెర్సన్ (జమైకా/ 50.93 సెకన్లు) వరుసగా మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. ఐదో స్థానంలో నిలిచిన కెన్యాకు చెందిన మాకిమిలా ఇమాజీతో సమానంగా హిమ కూడా 51.32 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసింది. కానీ, ఫొటో ఫినిష్ ఆధారంగా ఇమాజీకి ఐదో స్థానాన్ని ప్రకటించిన అధికారులు హిమకు ఆరో స్థానాన్ని కేటాయించారు.