క్రీడాభూమి

బాడ్మింటన్‌లో దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: బాడ్మింటన్ విభాగంలో భారత్ దూకుడును కొనసాగిస్తున్నది. కామనె్వల్త్ గేమ్స్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌ను ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న భారత్ సింగిల్స్ పోటీల్లోనూ రాణిస్తున్నది. తెలుగు తేజం పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ తదితరులు తమతమ విభాగాల్లో ప్రీ క్వార్టర్స్ చేరారు. బుధవారం పురుషుల సింగిల్స్‌లో అతిష్ లుబాను ఢీకొన్న శ్రీకాంత్ 21-13, 21-10 తేడాతో గెలిచాడు. క్వార్టర్స్ చేరడానికి అతను నిలుక కరుణరత్నేతో తలపడతాడు. అంతకు ముందు కరణరత్నే 21-5, 21-6 స్కోరుతో లియామ్ ఫాంగ్‌పై విజయం సాధించాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ 21-14, 21-16 ఆధిక్యంతో క్రిస్ట్ఫోర్ జీన్ పాల్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. తర్వాత మ్యాచ్‌లో అతను ఢీకొననున్న ఆంథోనీ జో తన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఇర్ఫాన్ సరుూద్ భట్టీని 22-20, 21-18 తేడాతో ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో సింధు 21-6, 21-13 తేడాతో ఆండ్రా వైట్‌సైడ్‌ను సులభంగా ఓడించి, ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తర్వాతి మ్యాచ్‌లో ఆమె వెండీ చెన్ సువాన్ యూతో తలపడుతుంది. మూడో రౌండ్ మ్యాచ్‌లో సువాన్ యూ 21-3, 21-2 ఆధిక్యంతో జో మోరిస్‌ను ఓడించింది. కాగా, సైనా తన ప్రత్యర్థి ఎల్సీ డి విలియర్స్‌ను 21-3, 21-1 ఆధిక్యంతో చిత్తు చేసింది. తర్వాతి మ్యాచ్‌లో ఆమె జెస్సికా లీతో తలపడుతుంది. మూడో రౌండ్‌లో జెస్సికా 21-9, 21-13 స్కోరుతో ఒగర్ సిముపాంగిలాపై గెలుపొందింది. రుత్విక శివానీ గద్దె 21-5, 21-7 స్కోరుతో గ్రేస్ అటిపకాపై గెలుపొందింది. ఆమె తర్వాతి మ్యాచ్‌లో యోజియా మిన్‌తో తలపడుతుంది. మూడో రౌండ్‌లో షమీమ్ బంగీతో మ్యాచ్ ఆడాల్సిన ఆమెకు వాకోవర్ లభించింది.