క్రీడాభూమి

ఓం ప్రకాశ్‌కు రెండో పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: ఈసారి కామనె్వల్త్ గేమ్స్‌లో షూటర్ ఓం ప్రకాశ్ మిథర్వాల్ రెండో పతకాన్ని సాధించాడు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అతనికి కాంస్యం లభించింది. క్వాలిఫయర్స్‌లో అద్భుతంగా రాణించి, టాపర్‌గా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన అతను మెడల్ రౌండ్‌లో అదే స్థాయిలో ప్రతిభ కనబరచలేకపోయాడు. మొత్తం 201.1 పాయింట్లు సంపాదించి మూడో స్థానంలో నిలిచాడు. ఈసారి కామనె్వల్త్‌లో రెండు పతకాలు కైవసం చేసుకున్న రెండో భారతీయుడిగా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. హీనా సిధు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం దక్కించుకోగా, ఓం ప్రకాశ్ రెండో కాంస్యాన్ని అందుకున్నాడు. ఈ విభాగంలో డానియల్ పెరచొలి (ఆస్ట్రేలియా), షకీల్ అహ్మద్ (బంగ్లాదేశ్) వరుసగా స్వర్ణ, రజత పతకాలను గెల్చుకున్నారు.
మిట్టల్‌కు కాంస్యం
పురుషుల షూటింగ్ డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుల్ మిట్టల్‌కు కాంస్య పతకం లభించింది. డేవిడ్ మెక్‌మాత్ (స్కాట్‌లాండ్), టిమ్ కియాక్ (వేల్స్) మొదటి రెండు స్థానాలను ఆక్రమించగా, మిట్టల్ తీవ్రంగా పోటీపడినప్పటికీ, కాంస్యంతో సంతృప్తి చెందాడు.