క్రీడాభూమి

స్వర్ణం వేటలో కోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: భారత సీనియర్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ కామనె్వల్త్ గేమ్స్‌లో పతకాల వేటను కొనసాగిస్తున్నది. మహిళల 48 కిలోల విభాగంలో సెమీ ఫైనల్‌లో ఆమె తన ప్రత్యర్థి, శ్రీలంక బాక్సర్ అనుష దిల్‌రుక్షి కొడితువకును సులభంగా ఓడించి, టైటిల్‌వైపు మరో అడుగు వేసింది. కాగా, పురుషుల విభాగంలో వికాస్ కృష్ణన్ (75 కిలోలు), మనీష్ కౌశిక్ (60 కిలోలు) తమతమ విభాగాల్లో సెమీ ఫైనల్స్ చేరి, పతకాలను ఖాయం చేసుకున్నారు. మనోజ్ కుమార్ (69 కిలోలు), సతీష్ కుమార్ (+91 కిలోలు), అమిత్ పంగాల్ (49 కిలోలు) ఇప్పటికే సెమీస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
తేజశ్విన్ విఫలం
అథ్లెటిక్స్‌లో భారత్ పతకాల వేటకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. 19 ఏళ్ల వయసులోనే పురుషుల హైజంప్‌లో జాతీయ రికార్డును నెలకొల్పి సంచలనం సృష్టించిన తేజశ్విన్ శంకర్‌కు కామనె్వల్త్ గేమ్స్‌లో తప్పక పతకం లభిస్తుందని అంతా జోస్యం చెప్పారు. కానీ, 2.27 మీటర్ల ఎత్తును లంఘించడానికి అతను చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీనితో అతను నిరాశతో వెనుదిరగక తప్పలేదు. ఇటీవల జరిగిన ఫెడరేషన్ కప్ చాంపియన్‌షిప్స్‌లో 2.28 మీటర్ల ఎత్తును సులభంగానే పూర్తి చేసి, కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన తేజశ్విన్ కామనె్వల్త్‌లో మాత్రం అదే స్థాయి ప్రతిభను కనబరచలేకపోయాడు. మొదట 2.18 మీటర్లు, ఆతర్వాత 2.21 మీటర్ల ఎత్తును పూర్తి చేసిన అతను 2.27 మీటర్ల వద్ద విఫలమయ్యాడు. మూడు ప్రయత్నాల్లోనూ అతను ఆ ఎత్తును పూర్తి చేయలేక, నిష్క్రమించాడు.
స్టార్క్ సంచలనం
గోల్డ్ కోస్ట్‌లో స్టార్క్ సంచలనం సృష్టించాడు. అయితే, స్టార్క్ అంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కాదు. అతని సోదరుడు బ్రెండన్ స్టార్క్. పురుషుల హైజంప్‌లో అతను 2.32 మీటర్ల ఎత్తును లంఘించి స్వర్ణ పతకం సాధించాడు. అదే తరుణంలో అతను తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును కూడా నెలకొల్పాడు. మిచెల్ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తుంటే, అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో తాను కూడా రాణించగలనని బ్రెండ్ నిరూపించాడు. కాగా, బహమాస్‌కు చెందిన జమాల్ విల్సన్ (2.30 మీటర్లు), కెనడా అథ్లెట్ జన్గో లొవెట్ (2.30 మీటర్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను అందుకున్నారు.
మహిళల లాంగ్ జంప్: మహిళల లాంగ్ జంప్‌లో భారత అథ్లెట్లు నయన జేమ్స్, నీనా వరాకిల్ క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో వరుసగా తొమ్మిది, పనె్నండు స్థానాల్లో నిలిచి ఫైనల్ రౌండ్‌కు అర్హత సంపాదించారు. నయన 6.34 మీటర్లు, నీనా 6.24 మీటర్ల దూరానికి దూకారు.