క్రీడాభూమి

ఓడి గెలిచిన హర్సే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 11: వేల్స్‌కు చెందిన అన్నా హర్సే మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్‌లో పరాజయాన్ని ఎదుర్కొంది. అయినప్పటికీ, మ్యాచ్‌ని చూసిన వేలాది మంది అభిమానాన్ని చూరగొంది. ఆమె వయసు కేవలం 11 సంవత్సరాలు కావడం, ర్యాంకింగ్స్‌లో తన కంటే ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న ప్రత్యర్థితోనూ చివరి వరకూ పోరాటాన్ని కొనసాగించడం ఆమె పట్ల ప్రేక్షకులకు అభిమానాన్ని పెంచాయి. మలేసియాకు చెందిన లిసియాన్ ఎలైస్ చాంగ్‌ను ఢీకొన్న ఆమె మొదటి సెట్‌ను కేవలం 17 నిమిషాల్లోనే గెల్చుకుంది. అయితే, అంతర్జాతీయ వేదికలపై ఎంతో అనుభవం ఉన్న చాంగ్ ఆతర్వాత వరుసగా రెండు సెట్లను గెల్చుకోవడంతో హర్సే ఈ పోటీల నుంచి నిష్క్రమించింది. ఆమె కోర్టును విడిచి వెళ్లే ముందు ప్రేక్షకులకు అభివాదం చేయగా, వారు కూడా లేచి నిలబడి, హర్షధ్వానాలతో ఆమెకు వీడ్కోలు పలికారు.