క్రీడాభూమి

ఢిల్లీని ముంచిన వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఏప్రిల్ 11: ఐపీఎల్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కి వర్షం కారణంగా అంతరాయం ఏర్పడడం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను నిలువునా ముంచేసింది. ప్రత్యర్థిని 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులకే కట్టడి చేసినప్పటికీ, ఆతర్వాత వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడడంతో డక్‌వర్త్ లూయస్ విధానాన్ని అమలు చేయడంతో నష్టపోయంది. ఆరు ఓవర్లలో 71 పరుగులు సాధించాల్సి ఉండగా, నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయ 60 పరుగులు చేయగలిగింది. ఫలితంగా పది పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది.
టాస్ గెలిచిన డేర్‌డెవిల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 11 పరుగుల వద్ద డార్సీ షార్ట్ వికెట్‌ను కోల్పోయంది. అతను ఆరు పరుగులు చేసి రనౌటయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ రహానే క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడేందుకు ప్రయత్నించాడు. అయతే పరుగుల వేటలో బెన్ స్టోక్స్ వికెట్ పారేసుకోవడంతో, 17 పరుగుల భాగస్వామ్యం తర్వాత రెండో వికెట్ కూలింది. కేవలం 22 బంతుల్లోనే 37 పరుగులు సాధించిన సంజూ శాంసన్‌ను షాబాజ్ నదీం క్లీన్ బౌల్డ్ చేశాడు. మరికొద్ది సేపటికే రహానే కూడా పెవిలియన్ చేరాడు. అతను 40 బంతుల్లో 45 పరుగులు సాధించి, నదీం బౌలింగ్‌లోనే క్రిస్ మోరిస్‌కు దొరికిపోయాడు. 29 పరుగులు చేసిన జొస్ బట్లర్‌ను మహమ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేయగా, రాజస్థాన్ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లకు 153 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి రాహుల్ త్రిపాఠీ 15, గౌతం 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వర్షం తగ్గిన తర్వాత, మళ్లీ ఆటను మొదులుపెట్టినప్పుడు ఢిల్లీ లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 71 పరుగులుగా నిర్ధారించారు. ఈ లక్ష్యాన్ని అందుకోలేకపోయన ఢిల్లీ జట్టు గ్లేన్ మాక్స్‌వెల్ (17), క్రిస్ మోరిస్ (0), రిషభ్ పంత్ (20), విజయ్ శంకర్ (3) వికెట్లు కోల్పోయ 60 పరుగులు చేసింది. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి క్రిస్ మోరిస్ (17), శ్రేయాస్ అయ్యర్ (0) క్రీజ్‌లో ఉన్నారు.