క్రీడాభూమి

రైనాకు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 12: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా గాయం కారణంగా ఈసారి ఐపీఎల్‌లో తమ జట్టు ఆడబోయే రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చిదంబరం స్టేడియంలో మంగళవారం మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతను కండరాలు బెణకడంతో ఇబ్బంది పడ్డాడు. దాని ప్రభావం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో, వచ్చే రెండు మ్యాచ్‌ల్లో అతనికి విశ్రాంతినిచ్చినట్టు చెన్నై జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఈనెల 15న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో, 20న రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ రైనా ఆడడం లేదని అధికారులు తెలిపారు.