క్రీడాభూమి

‘వ్యక్తిగత కోచ్’ ముసుగులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక షూటర్ తండ్రికి గుర్తింపు కార్డును తాము జారీ చేయలేదని, ఈ విషయంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్ చెఫ్ డె మిషన్ విక్రం సిసోడియా స్పష్టం చేశాడు. సదరు వ్యక్తికి అధికారిక గుర్తింపు కార్డు ఎవరిచ్చారో, అతనికి అది ఎలా వెళ్లిందో తనకు తెలియదని అన్నాడు. పూర్తి వివరాలు తెలియనందున, తాను ఏమీ వ్యాఖ్యానించలేనని స్పష్టం చేశాడు.

బ్రిస్బేన్, ఏప్రిల్ 12: నిబంధనలు ఎన్ని ఉన్నా, వాటికి గండికొట్టి, స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతునే ఉంటాయి. కామనె్వల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌ను చూడడంతోపాటు... అధికారులతో సమానంగా లాంజ్‌లో కూర్చొని, అన్ని సౌకర్యాలు అనుభవించడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిలో అన్నిటి కంటే సులభమైన పదవి ‘వ్యక్తిగత కోచ్’. సాధారణంగా ఏ క్రీడలోనైనా చీఫ్ కోచ్, అసిస్టెంట్ కోచ్‌తోపాటు ఫిజియోథెరపిస్టు తదితరులు అధికార ప్రతినిధుల రూపంలో ఆయా క్రీడాకారులతో కలిసి వెళతారు. వారికి ప్రత్యేక గుర్తింపుకార్డు ఉంటుంది. క్రీడా గ్రామంలో క్రీడాకారులతో సమానంగా వారికి కూడా అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి. అంతేగాక, ఏ పోటీలనైనా చూసేందుకు వీలుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, పోటీలు జరిగే అన్ని కేంద్రాల్లోకీ వారు నిరాటంకంగా వెళ్లవచ్చు. టీ, టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ ఏదైనా తినవచ్చు. విశ్రాంతి గృహాల్లో సేదతీరవచ్చు. ఇన్ని హంగులు, ఆర్భాటాలు ఉంటాయి కాబట్టే, దాదాపుగా క్రీడాకారులతో సమానమైన సంఖ్యలో సపోర్టింగ్ స్ట్ఫా ఉంటుంది. అయితే, ఈ అధికారిక బృందంలో లేకపోయినా, వారి మాదిరిగానే అన్ని సౌకర్యాలు పొందాలంటే ఏం చేయాలి? చాలా మంది వద్ద ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం ఉంది. అదే ‘వ్యక్తిగత కోచ్’ పదవి. చాలా మంది టెన్నిస్, బాడ్మింటన్ స్టార్లు తమ తల్లిదండ్రులను ఇదే హోదా మీద దేశదేశాలు తిప్పేస్తుంటారు. ప్రభుత్వ సొమ్మును తమ స్వప్రయోజనాలకు వాడేస్తుంటారు. కామనె్వల్త్ గేమ్స్‌లో ఒక మహిళా షూటర్‌కు వ్యక్తిగత కోచ్‌ని అంటూ ఆమె తండ్రి హడావుడి చేయడం, చాలాకాలంగా విమర్శలకు గురవుతున్న ఈ విధానంపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. అధికారుల లాంజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన అతనిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన అతను తన వద్ద గుర్తింపు కార్డు కూడా ఉందని, వ్యక్తిగత కోచ్ హోదాలో వచ్చిన తనను ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను లోనికి పంపాల్సిందేనంటూ వాదనకు దిగాడు. కానీ, నిబంధనలను అనుమతించవంటూ అతనిని భద్రతా సిబ్బంది అక్కడి నుంచి బయటకు పంపారు.
గుర్తింపు కార్డు ఎక్కడిది?
భారత బృందంలోని ఒక మహిళా షూటర్ తండ్రినని, ఆమెకు తానే వ్యక్తిగత కోచ్‌నని ప్రకటించుకొని లాంజ్‌లోకి వచ్చే ప్రయత్నం చేసిన వ్యక్తికి గుర్తింపు కార్డు ఎక్కడిది? దానిని ఎవరిచ్చారు? అది నిజంగానే భారత అధికారులు జారీ చేసిందా లేక నకిలీదా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావడం లేదు. అయితే, అతని వద్ద ఉన్న గుర్తింపు కార్డు భారత్‌లో అధికారులు జారీ చేసిందేనని సమాచారం. ఈ విషయంపై భారత రైఫల్ సంఘం అధ్యక్షుడు రణీందర్ సింగ్ స్పందిస్తూ, కామనె్వల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో వ్యక్తిగత కోచ్‌లకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశాడు. లోనికి వచ్చేందుకు ప్రయత్నించిన వ్యక్తికి ఆ హోదాతో ఎవరు గుర్తింపు కార్డు జారీ చేశారో తనకు తెలియదని అన్నాడు. పొరపాటు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. లెక్కలేనంత మంది కోచ్‌లు, అసిస్టెంట్ కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులతో, లక్షలాది రూపాయలు వెచ్చించి శిక్షణ ఇప్పిస్తుంటే, మళ్లీ వ్యక్తిగత కోచ్‌లు ఎందుకన్న విమర్శ చాలాకాలంగా వినిపిస్తున్నది. వివిధ దేశాలకు తమతమ తల్లిదండ్రులు లేదా సన్నిహితులను తీసుకెళ్లడానికి క్రీడాకారులు అనుసరిస్తున్న దగ్గరి పద్ధతిగా ‘వ్యక్తిగత కోచ్’ హోదాను పలువురు అభివర్ణిస్తున్నారు. జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు ఈ అక్రమ విధానాలను అరికట్టాలని కోరుతున్నారు.