క్రీడాభూమి

అజ్లన్ షా హాకీ గెలిస్తేనే రేసులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపో (మలేసియా), ఏప్రిల్ 11: ప్రతిష్ఠాత్మక అజ్లన్ షా హాకీ టోర్నమెంట్ టైటిల్ రేసులో కొనసాగాలంటే భారత్‌కు మంగళవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్‌ని తప్పక గెల్చుకోవాలి. గ్రూప్ దశలో మూడో మ్యాచ్‌ని కెనడాతో ఆడిన భారత్ 3-1 తేడాతో విజయం సాధించింది. మొత్తం మీద మూడు మ్యాచ్‌ల్లో రెండింటిని గెలిచి ఆరు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ కూడా మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒక విజయాన్ని నమోదు చేసి, మూడు పాయింట్లు సంపాదించింది. ఆస్ట్రేలియా తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ ఎనిమిది పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. ఇలావుంటే, ఈ టోర్నీలోనే అత్యంత ఉత్కంఠ భరితమైన మ్యాచ్ మంగళవారం జరగనుంది. ఒకప్పుడు హాకీ ప్రపంచాన్ని శాసించిన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ప్రతి మ్యాచ్ యుద్ధపూరిత వాతావరణంలో కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది. హాకీపై ఈ రెండు జట్లు పట్టును కోల్పోయి, అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ జట్లు ఇతర జట్లతో ఆడే మ్యాచ్‌లను ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ, పరస్పరం ఢీ కొంటున్నప్పుడు మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. ఉత్కంఠ రేపు మ్యాచ్‌కి భారత్, పాకిస్తాన్ జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇరు జట్లకు ఈపోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అయితే, సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టుకు మరింత కీలకమైన మ్యాచ్ ఇది. ఇందులో నెగ్గితేనే, ఇతరత్రా అంశాలు, లెక్కలు.. పాయింట్లపై ఆధారపడకుండా భారత్ రేసులోనే ఉంటుంది. దీనితో సర్దార్ బృందం మంగళవారం పాకిస్తాన్‌ను ఓడించాలన్న పట్టుదలతో మైదానంలోకి దిగనుంది.