క్రీడాభూమి

పురుషులే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 15: మహిళలతో పోలిస్తే ఈసారి కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్‌కు పురుషులే ఎక్కువ పతకాలను సాధించిపెట్టారు. పురుషుల విభాగాల్లో 13 స్వర్ణం, 9 రజతం, 13 కాంస్యం చొప్పున మొత్తం 35 పతకాలు లభించాయి. మహిళల విభాగాల్లో 12 స్వర్ణం, 10 రజతం, 6 కాంస్యం చొప్పున మొత్తం 28 పతకాలు దక్కాయి. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం వచ్చాయి.
ఈసారి కామనె్వల్త్‌కు మొత్తం 218 మందిని భారత్ బరిలోకి దించింది. వీరిలో 115 మంది పురుషులుకాగా, 103 మంది మహిళలు. అథ్లెటిక్స్‌లో 28 (పురుషులు 16, మహిళల 12), బాడ్మింటన్‌లో 10 (పురుషులు 5, మహిళలు 5), బాస్కెట్‌బాల్‌లో 24 (పురుషుల జట్టులో 12, మహిళల జట్టులో 12), బాక్సింగ్‌లో 12 (పురుషులు 8, మహిళలు 4), సైక్లింగ్‌లో 9 (పురుషులు 4, మహిళలు 5), జిమ్నాస్టిక్స్‌లో 7 (పురుషులు 3, మహిళలు 4), హాకీలో 36 (పురుషుల జట్టు 18, మహిళల జట్టు 18), లాన్ బౌల్‌లో 10 (పురుషులు 5, మహిళలు 5), పారా స్పోర్ట్స్‌లో 8 (పురుషులు 3, మహిళలు 5), షూటింగ్‌లో 27 (పురుషులు 15, మహిళలు 12), స్క్వాష్‌లో 6 (పురుషులు 4, మహిళలు 2), స్విమ్మింగ్‌లో 5 (పురుషులు 3, మహిళలు 2), టేబుల్ టెన్నిస్‌లో 10 (పురుషులు 5, మహిళలు 5), వెయిట్‌లిఫ్టింగ్‌లో 16 (పురుషులు 8, మహిళలు 8), రెజ్లింగ్‌లో 12 (పురుషులు 6, మహిళలు 6) చొప్పున పోటీపడ్డారు.

చిత్రం..డీజే అవతారంలో ఆకట్టుకున్న జమైకా స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్