క్రీడాభూమి

బైబై గోల్డ్ కోస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 15: పనె్నండు రోజులపాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ‘మినీ ఒలింపిక్స్’ కామనె్వల్త్ గేమ్స్‌కు ఆదివారం అట్టహాసంగా జరిగిన ముగింపు ఉత్సవంతో తెరపడింది. స్ప్రింట్ వీరుడు, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ డీజే అవతారంలో కనిపించి ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. వివిధ సాంస్కృతి కార్యక్రమాలకు అనుగుణంగా సౌండ్ ఎఫెక్ట్స్‌తో అతను ఆకట్టుకున్నాడు. స్టార్ బాక్సర్ మేరీ కోమ్ భారత బృందానికి నాయకత్వం వహించి అభిమానులను అలరించింది. ప్రారంభోత్సవంలో బాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా ముందు నడవగా, ముగింపు ఉత్సవంలో ఈ అవకాశాన్ని మేరీ కోమ్ సొంతం చేసుకుంది. సాధారణంగా అంతర్జాతీయ ఈవెంట్స్‌లో భారత మహిళల చీరలోనే దర్శనమిచ్చేవారు. కానీ, ఈసారి కామనె్వల్త్ ప్రారంభోత్సవంతోపాటు ముగింపు ఉత్సవంలోనూ నడవడానికి ఇబ్బందిగా ఉందంటూ చీరలను కాకుండా ప్యాటు, జెర్సీలతో కవాతు చేశారు.
కాగా, ‘నీడిల్ లెస్’ విధానాన్ని కఠినంగా అమలు చేసిన ఆస్ట్రేలియా అధికారులు, దీనికి భిన్నంగా వ్యవహరించిన పలువురు అథ్లెట్లపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ కారణంగా కామనె్వల్త్ క్రీడా గ్రామం నుంచి బహిష్కరణకు గురైన వారిలో భారత అథ్లెట్లు ఇర్ఫాన్, రాకేష్ బాబు కూడా ఉన్నారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించడాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని ముందుగానే ప్రకటించిన కామనె్వల్త్ గేమ్స్ నిర్వాహణ కమిటీ (ఓసీ) చివరి వరకూ అదే విధానాన్ని పకడ్బందీగా అమలు చేసింది. గతంతో పోలిస్తే, ఈసారి కామనె్వల్త్ గేమ్స్‌లో చాలా తక్కువ డోప్ కేసులు నమోదయ్యాయి. క్రీడాస్ఫూర్తితో జరిగిన కామనె్వల్త్ క్రీడలకు వేదికగా గోల్డ్ కోస్ట్ చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంది.
స్టార్ అట్రాక్షన్ జెసికా
ప్రఖ్యాత పాప్ గాయకురాలు జెసికా మోబాయ్ ఆదివారం నాటి ముగింపు ఉత్సవంలో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచింది. కిక్కిరిసిపోయిన కరారా స్టేడియంలో ముగింపు ఉత్సవాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ జెసికా పాటలకు మైమరచిపోయారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా గాయకులు, కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకోగా, అక్షర క్రమంలో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులు మార్చ్ఫాస్ట్‌లో పాల్గొన్నారు.
బర్మింగ్‌హామ్‌లో కలుద్దాం..
గోల్డ్ కోస్ట్‌లో 21వ కామనె్వల్త్ గేమ్స్ ముగిసినట్టు ఈ క్రీడల సమాఖ్య అధ్యక్షురాలు లూసీ మార్టిన్ ప్రకటించింది. ఎంతో మంది ప్రతిభావంతులు పోటీపడి, క్రీడాస్ఫూర్తిని చాటుకున్న కామనె్వల్త్ గేమ్స్ ముగిశాయి అంటూ ఆమె అధికారిక ప్రకటన చేసింది. ఇక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంటున్న తామంతా 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగే 22వ కామనె్వల్త్ గేమ్స్‌లో కలుద్దామని చెప్పింది. ‘ఒక చోట కామనె్వల్త్ గేమ్స్ ముగిస్తే, రాబోయే క్రీడలకు సన్నాహాలు మొదలవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే, కామనె్వల్త్ గేమ్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ’ అని వ్యాఖ్యానించింది.
వలంటీర్ల కృషి
గోల్డ్ కోస్ట్‌లో 21వ కామనె్వల్త్ గేమ్స్ విజయవంతం కావడానికి అధికారులతో సమానంగా వలంటీర్ల కృషి కూడా ఉంది. సుమారు 15,000 మంది వలంటీర్లు నిరంతరం శ్రమించి, వివిధ దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లు, సపోర్టింగ్ స్ట్ఫాతోపాటు ఇతర అధికారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని విధాలా సేవలు అందించారు. ఎప్పటికప్పుడు వారి అవసరాలను గుర్తించి, వాటిని క్షణాల్లో పూర్తి చేసి, ఇలాంటి మెగా ఈవెంట్స్‌లో వలంటీర్ల ఆవస్యకత ఎలాంటిదో నిరూపించారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వలంటీర్ల సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.

చిత్రం..పాటలతో అలరించిన పాప్ గాయని జెసికా మోబాయ్