క్రీడాభూమి

మూడోస్థానం... ముగిసిన ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 15: కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్ ప్రస్థానం ముగిసింది. మొత్తం 66 పతకాలు సాధించి, మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు ‘మినీ ఒలింపిక్స్’లో ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. 2010 ఢిల్లీ కామనె్వల్త్ గేమ్స్‌లో రెండో స్థానాన్ని భారత్ సంపాదించింది. అయితే, విదేశాల్లో జరిగిన కామనె్వల్త్‌లో దీనిని అతి పెద్ద విజయంగా భావించాలి. పతకాల పరంగా చూస్తే, 2010 (101 పతకాలు), 2002 (69 పతకాలు) తర్వాత తాజాగా సాధించిన 66 పతకాల ప్రదర్శన మూడో స్థానంలో నిలుస్తుంది. ఎంతో అనుభవం ఉన్న సీనియర్లు, ఉత్సాహంతో ఉరకలు వేసే యువ అథ్లెట్లతో కూడిన భారత బృందం మూడో స్థానంలో నిలవడం దేశ క్రీడాభవిష్యత్తుకు అద్దం పడుతున్నది. ‘మినీ ఒలింపిక్స్’గా పేర్కొనే కామనె్వల్త్ గేమ్స్‌లో రాణించడం ద్వారా, రాబోయే 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ తనదైన ముద్ర వేయానికి సిద్ధమవుతున్నట్టు భారత్ పరోక్షంగా సంకేతాలు పంపింది. టీనేజ్ షూటర్లు మనూ భాకర్, మెహూలీ ఘోష్, ఆశిష్ భన్వాలా నుంచి టేబుల్ టెన్నిస్‌లో మానికా బాత్రా, ఎంతో ఆత్మవిశ్వాసం కనబరచిన నీజర్ చోప్రా వరకూ ఎంతో మంది ఈ పోటీల్లో అద్భుతంగా రాణించారు. క్రీడా ప్రపంచాన్ని శాసించే సత్తా తమకు ఉందని నిరూపించారు. సీనియర్లు కెరీర్‌ను ముగించినప్పటికీ, వారి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ల సామర్థ్యం ఉన్న యువ సంచలనాలు తెరపైకి రావడం హర్షణీయ పరిణామం. మహిళల బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ స్వర్ణ పతకం సాధించి, ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. మేరీ కోమ్, సీమా పునియా, సుశీల్ కుమార్ వంటి సీనియర్లు అంతర్జాతీయ వేదికలపై అనుభవం ఎంతబాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని రుజువు చేశారు. షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ పోటీల్లో అత్యధిక పతకాలు లభిస్తాయని ముందుగా ఊహించిందే. ఈ జాబితాలో టేబుల్ టెన్నిస్ కొత్తగా చేరింది. 2014లో కేవలం ఒక కాంస్య పతకం దక్కిన కారణంగా ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. అయితే, 22 ఏళ్ల మానికా బాత్రా అద్వితీయ ప్రతిభ టేబుల్ టెన్నిస్‌లోనూ భారత్ తన ఉనికిని చాటుకునేలా చేసింది. మేరీ కోమ్, సుశీల్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా, అందరి అంచనాల మేరకు వారు గొప్పగా రాణించారు. సుశీల్ వయసు 34 సంవత్సరాలుకాగా, ముగ్గురు పిల్ల తల్లి మేరీ కోమ్ వయసు 35 సంవత్సరాలు. అయినప్పటికీ, ఉత్సాహానికి, ప్రతిభకు వయసు అడ్డం కాబోదని నిరూపిస్తూ వీరిద్దరూ స్వర్ణాలను కైవసం చేసుకొని, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న మేరీ కోమ్ కామనె్వల్త్ గేమ్స్‌లో మొదటిసారి పోటీ పడి, టైటిల్‌ను అందుకోవడం విశేషం. సుశీల్ వరుసగా మూడోసారి కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకొని, హ్యాట్రిక్ సాధించాడు. షూటింగ్‌లో అత్యధికంగా 16 పతకాలు వచ్చాయి. అనీష్ భన్వాల్ కేవలం 15 సంవత్సరాల వయసులోనే స్వర్ణ పతకాన్ని సాధించి, కామనె్వల్త్‌లో పతకాన్ని అందుకున్న భారతీయుల్లో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకు సుమారు 24 గంటల ముందు 16 ఏళ్ల మనూ భాకర్ రికార్డును అతను బద్దలు చేశాడు. ఈ ఇద్దరు టీనేజర్లు షూటింగ్‌లో భారతీయుల వారసత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
ఆకట్టుకున్న లిఫ్టర్లు
గతంలో కామనె్వల్త్ లేదా ఇతర అంతర్జాతీయ మెగా ఈవెంట్స్‌కు ముందు పలువురు వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్ పరీక్షలో పట్టుబడడం, తత్ఫలితంగా నిషేధానికి గురికావడం ఆనవాయితీగా ఉండేది. కానీ, ఈసారి ‘క్లీన్ స్పోర్ట్’గా భారత్‌ను నిలబెట్టిన లిఫ్టర్లు అందరినీ ఆకట్టుకున్నారు. ఒక్క డోప్ కేసు కూడా నమోదు కాకపోవడం మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది. మీరాబాయ్ చాను, సంజితా చాను, సతీష్ శివలింగం తదితరులు దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేశారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, మరో రెండు కాంస్యాలతో మొత్తం తొమ్మిది పతకాలను కైవసం చేసుకుంది. పతకాల పరంగా చూస్తే, షూటింగ్, రెజ్లింగ్ తర్వాత మూడో స్థానంలో ఉన్నప్పటికీ, నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడినట్టు ముద్ర వేయించుకున్న లిఫ్టర్ లేకపోవడంతో అంతా ఆనందించారు.
చిత్రం..కామనె్వల్త్ గేమ్స్ ముగింపు ఉత్సవంలో ఫ్లాగ్ బేరర్
మేరీ కోమ్‌తో భారత బృందం