క్రీడాభూమి

జమైకా ఫ్లాప్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 16: ‘స్ప్రింట్ రారాజు’ ఉసేన్ బోల్ట్ దశాబ్దం పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్‌ను శాసించినప్పుడు ఉజ్వలంగా వెలిగిపోయిన జమైకా అతను రిటైరైన తర్వాత వెలవెలబోతున్నది. కామనె్వల్త్ గేమ్స్‌లో ఫ్లాప్ షో అథ్లెటిక్స్‌లో ఆ దేశ పతనాన్ని స్పష్టం చేస్తున్నది. గేమ్స్‌లో పోటీపడుతున్న తన దేశ అథ్లెట్లను ప్రోత్సహించేందుకు బోల్ట్ స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. కామెంటేటర్‌గా, డీజేగా వివిధ అవతారాల్లో కనిపించి, మెప్పించిన బోల్ట్ సంబరాలు చేసుకుంటే, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో జమైకా అథ్లెట్లు నీరుగారిపోయారు. ఒక్క స్వర్ణ పతకాన్ని కూడా గెల్చుకోలేకపోయారంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. 100 మీటర్ల స్ప్రింట్‌లో యొహాన్ బ్లేక్ విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన అకానీ సింబైన్, హెన్రికో బ్రెంటిస్ వరుసగా స్వర్ణ, రజత పతకాలను సాధిస్తే, బ్లేక్ కాంస్యంతో సరిపుచ్చుకున్నాడు. మహిళల 200 మీటర్ల పరుగులో ఒలింపిక్ చాంపియన్ ఎలైన్ థాంసన్ పతకాన్ని సాధించలేకపోయింది. బహమాస్ అథ్లెట్ షౌనే మిల్లర్ ఉబో ఈ అగ్రస్థానంలో నిలిచి, స్వర్ణాన్ని అందుకుంది. పురుషుల 200 మీటర్ల పరుగులోనూ జమైకాకు చుక్కెదురైంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో అథ్లెట్ జెరీర్ రిచర్డ్స్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. మహిళల 100 మీటర్ల మిచెలే లీ అయే సత్తా చాటింది. మొత్తం మీద స్వర్ణాలు ఖాయమనుకున్న ఏ విభాగంలోనూ జమైకా రాణించలేకపోయింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో రొనాల్డ్ లెవీ స్వర్ణాన్ని అందుకోవడాన్ని మినహాయిస్తే, ట్రాక్ అండ్ ఫీల్డ్‌పై జమైకా ఆధిపత్యం ఏమాత్రం కనిపించలేదు. బోల్ట్ కెరీర్ కొనసాగినంత వరకూ అద్భుతాలు సృష్టించిన జమైకా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఇప్పుడు ఎందుకు విఫలమవుతున్నారన్న ప్రశ్న అందరినీ వేధిస్తున్నది. బోల్ట్ వారసుడు ఎవరన్న ప్రశ్నకు ఇప్పట్లో సమాధానం లభించే కష్టమనే చెప్పాలి.