క్రీడాభూమి

ఆనందంతో ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 16: కామనె్వల్త్ గేమ్స్ ముగిసి, ఎక్కడి వారు అక్కడ వెళ్లిపోయిన తర్వాత కూడా ఇక్కడి క్రీడాగ్రామంలో కొందరు ఇంకా సంబరాల్లో మునిగితేలుతున్నారు. అలాంటి వారిలో ఆస్ట్రేలియా మహిళా ఫ్లైవెయిట్ బాక్సర్ టేలా రాబర్ట్‌సన్‌ది మొదటి స్థానం. ఏడుగురు పోటీపడిన ఈ విభాగంలో 19 ఏళ్ల టేలాకు మొదటి రౌండ్‌లో బై లభించింది. దీనితో ఆమె నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లింది. అక్కడ ఇంగ్లాండ్‌కు చెందిన లీసా వైట్‌సైడ్‌తో పోటీపడి పరాజయాన్ని ఎదుర్కొంది. నిబంధనలను అనుసరించి సెమీస్‌లో ఓడిన ఇద్దరు బాక్సర్లకు కాంస్యాలు లభించాయి. రింగ్‌లోకి దిగిన ఒక్క మ్యాచ్‌లోనూ ఓడినప్పటికీ, కామనె్వల్త్ గేమ్స్ పతకం దక్కడంతో టేలా ఆదంనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. 2015లో ప్రమాదవశాత్తు కిందపడడంతో తలకు బలమైన గాయమై, ఒకానొక దశలో కెరీర్‌కు గుడ్‌బై చెప్తుందనుకున్న వైట్‌సైడ్ ఫైనల్‌లో నైజీరియా బాక్సర్ కార్లీ మెక్‌నాల్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని అందుకోవడం విశేషం.