క్రీడాభూమి

తండ్రి అడుగుజాడల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 16: గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్ పురుషుల 64 కిలోల లైట్ వెల్టర్‌వెయిట్ బాక్సింగ్‌లో రజత పతకం సాధించిన థామస్ బ్లూమెన్‌ఫెల్డ్‌ను చాలా మంది తండ్రి చాటు కొడుకంటూ వెక్కిరిస్తుంటారు. న్యూయార్క్‌లో నివాసం ఉంటున్నప్పటికీ, తన స్వదేశమైన కెనడాకే ప్రాతినిథ్యం వహించిన థామస్‌కు తన తండ్రి బాబ్ బ్లూమెన్‌ఫెల్డ్ అంటే వల్లమాలిన అభిమానం. బాబ్ ఒకప్పుడు ప్రొఫెషనల్ బాక్సర్‌గా ఎదగాలని అనుకున్నాడు. కానీ, వివిధ కారణాలతో అతని కోరిక నెరవేరలేదు. ఒకప్పుడు తాను వాడిన గ్లోవ్స్‌ను అటకెక్కించాడు. థామస్ చిన్నప్పుడు ఒకసారి అనుకోకుండా ఆ గ్లోవ్స్‌ను చూశాడు. ఆ క్షణం నుంచే అతనికి బాక్సింగ్‌పై మక్కువ పెరిగింది. తండ్రి నుంచి బాక్సింగ్‌లో ఒనమాలు దిద్దుకున్నాడు. క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో ఫైనల్ వరకూ చేరినప్పటికీ, నైజీరియా బాక్సర్ జొనాస్ జోన్స్ చేతిలో ఓడాడు. అయితే, రజతంతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చిందన్న బాధ అతనిలో మచ్చుకైనా కనిపించలేదు. తన ప్రయత్నం తాను చేశానని, జయాపజయాల గురించి విపరీతంగా ఆలోచించడంలో అర్థం లేదంటూ సిసలైన క్రీడాస్ఫూర్తిని చాటాడు. తండ్రి బాబ్ గ్లోవ్స్‌తో స్ఫూర్తిని పొందిన తాను ఈ పతకాన్ని ఆయనకే అంకితమిస్తున్నానని ప్రకటించాడు. పతకం ఏదైతేనేం.. తండ్రిపై అతనికి ఉన్న ప్రేమకు జోహార్లు చెప్పాల్సిందే.