క్రీడాభూమి

పరువు నిలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 16: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో పోయిన పరువు కామనె్వల్త్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా నిలబెట్టుకోగలిగామని ఆస్ట్రేలియా అధికారులు సంతోషిస్తున్నారు. ఈనెల ఐదున మొదలైన ‘మినీ ఒలింపిక్స్’ ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. 80 స్వర్ణం, 59 రజతం, 59 కాంస్యాలతో మొత్తం 198 పతకాలు కైవసం చేసుకొని ఆస్ట్రేలియా నంబర్ వన్ స్థానంలో నిలవడంతో క్రీడాభిమానులు బాల్ ట్యాంపరింగ్ కేసును దాదాపు మరచిపోయారు. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లినప్పుడు, కామరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన సంఘటన ఆస్ట్రేలియా క్రికెట్ పరువు పోగొట్టుకుంది. బాన్‌క్రాఫ్ట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తొమ్మిది నెలలు సస్పెండ్ చేయడంతోపాటు, సూత్రధారి డేవిడ్ వార్నర్, కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను ఏడాదిపాటు బహిష్కరించడం చర్చనీయాంశమైంది. క్రికెట్‌లో ఆస్ట్రేలియా కనబరుస్తున్న ఆధిపత్యం, సాధిస్తున్న విజయాలను బాల్ ట్యాంపరింగ్ సంఘటనతో ముడిపెట్టడం సహజంగానే అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. పరువు నట్టేక కలిపిరంటూ క్రికెటర్లపై తీవ్ర స్థాయిలో ప్రజలు ధ్వజమెత్తుతున్న సమయంలోనే కామనె్వల్త్ గేమ్స్ మొదలయ్యాయి. ఒకటిరెండు సంఘటనలను మినహాయిస్తే, ఈసారి గేమ్స్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పైగా ఆస్ట్రేలియా టాపర్‌గా నిలిచింది. క్రీడాభిమానులు కూడా బాల్ ట్యాంపరింగ్ సంఘటను మరచిపోయి, కామనె్వల్త్ గేమ్స్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేయడం అభిమానులకు ఊరటనిచ్చింది. ఏ చిన్న పొరపాటు జరిగినా, విమర్శలు మరింత తీవ్ర రూపం దాల్చేవి. డోప్ కేసులు తెరపైకి వచ్చినా, అధికారులు పక్షపాత వైఖరిని అనుసరించారన్న ఆరోపణలు వెల్లువెత్తినా, స్వదేశంలో పరిస్థితి మరోలా ఉండేది. కానీ, ఎలాంటి ఆటంకాలు లేకుండా, విమర్శలు రాకుండా కామనె్వల్త్ గేమ్స్‌ను విజయవంతంగా ముగించిన అధికారులు పరువు నిలిచిందంటూ ఆనందిస్తున్నారు. పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించడంతో సంతోషిస్తున్నారు. మొత్తానికి కామనె్వల్త్ గేమ్స్ పుణ్యమాని బాల్ ట్యాంపరింగ్ కేసు మరుగుపడింది.