క్రీడాభూమి

కుప్పకూలిన ఢిల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సోమవారం జరిగిన ఇండియ న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏకంగా 71 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 201 ప రుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఢిల్లీ 129 పరుగులకే కుప్పకూలిం ది. జట్టులో రిషభ్ పంత్, గ్లేన్ మాక్స్‌వెల్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగ లిగారంటే, ఢిల్లీ బ్యాటింగ్ ఏ విధంగా పతనమైందో ఊహించుకోవచ్చు. సునీ ల్ నారైన్, కుల్దీప్ యాదవ్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు.
డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ నితీష్ రాణా అర్ధ శతకంతో మెరుగైన స్థితికి చేరింది. అతను 35 బంతులు ఎదుర్కొని, ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 59 పరుగులు చేశాడు. క్రిస్ లిన్ 31 (29 బంతులు, 4 ఫోర్లు, ఒక సిక్సర్), రాబిన్ ఉతప్ప 35 (19 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చొప్పున పరుగులు సాధించారు. చివరిలో చెలరేగిపోయిన ఆండ్రె రసెల్ కేవలం 12 బంతుల్లోనే, ఆరు సిక్సర్ల సాయంతో 41 పరుగులు సాధించడంతో నైట్ రైడర్స్ స్కోరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 200 పరుగులు చేయగలిగింది. రాహుల్ తివాతియా మూడు ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, క్రిస్ మోరిస్ చెరి రెండు వికెట్లు సాధించారు.
నైట్ రైడర్స్‌ను కోల్‌కతాలోనే ఓడించేందుకు 201 పరుగులు సాధించాల్సిన ఢిల్లీ ఇన్నింగ్స్ అత్యంత దారుణంగా మొదలైంది. కెప్టెన్ గౌతం గంభీర్ (8), ఇంగ్లాడ్ ఓపెనర్ జాసన్ రాయ్ (1), హార్డ్ హిట్టర్ శ్రేయాస్ అయ్యర్ (4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. యువ సంచలనం రిషభ్ పంత్ జట్టును ఆదుకునే బాధ్యతను భుజాలపై వేసుకొని, కొంత సేపు నైట్ రైడర్స్ బౌలింగ్‌కు ఎదురునిలిచాడు. 26 బంతులు ఎదుర్కొన్న అతను ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో యుజువేంద్ర చాహల్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. వేగంగా స్కోరును ముందుకు తీసుకెళతాడనుకున్న రాహుల్ తివాతియా కేవలం ఒక పరుగు చేసి, ఔట్‌కావడంతో ఢిల్లీ కష్టాలు రెట్టింపయ్యాయ. 22 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 47 పరుగులు చేసి, ప్రమాదకంగా కనిపించిన గ్లేన్ మాక్స్‌వెల్‌ను రాబిన్ ఉతప్ప క్యాచ్ పట్టగా కుల్దీప్ యాదవ్ వెనక్కు పంపాడు. 113 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్‌ను కోల్పోయంది. విజయ్ శంకర్, క్రిస్ మోరిస్ చెరి రెండు పరుగులు చేసి, పెవిలియన్ దారి పట్టారు. ఏడు పరుగులు చేసిన మహమ్మద్ షమీని అండ్రె రసెల్ క్యాచ్ పట్టగా సునీల్ నారైన్ ఔట్ చేశాడు. 128 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ చేజార్చుకున్న ఢిల్లీ ఓటమి ఖాయమైంది. మరో పరుగు తర్వాత ట్రెంట్ బౌల్ట్‌ను కుల్దీప్ యాదవ్ రిటర్న్ క్యాచ్ పట్టుకోవడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌కు 129 పరుగుల వద్ద తెరపడింది. నైట్ రైడర్స్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 200 (నితీష్ రాణా 59, క్రిస్ లిన్ 31, రాబిన్ ఉతప్ప 35, అండ్రె రసెల్ 41 (రాహుల్ తివాతియా 3/18, ట్రెంట్ బౌల్ట్ 2/29, క్రిస్ మోరిస్ 2/41).
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 14.2 ఓవర్లలో 129 ఆలౌట్ (రిషభ్ పంత్ 43, గ్లేన్ మాక్స్‌వెల్ 47, సునీల్ నారైన్ 3/18, కుల్దీప్ యాదవ్ 3/32).