క్రీడాభూమి

గల్లీ క్రికెట్‌లో సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 17: ముంబయిలోని ఒక గల్లీలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాడు. ఓస్..అంతేనా అనుకోకండి...గల్లీ క్రికెట్ ఆడుతున్న యువకులతో కలసి బ్యాటింగ్ కూడా చేశాడండి. దీనిని మీరు నమ్మండి...నమ్మకపోండి...ఈ వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోందంటే అంతా నమ్ముతారు. వివరాల్లోకి వెళ్తే...ఒక గల్లీలో సరదాగా క్రికెట్ ఆడుతున్న కొందరు యువకులు తెల్లని షర్టు, నల్లని ట్రౌజర్ ధరించి తమ పక్కన కారు దిగిన వ్యక్తిని చూసి నమ్మలేకపోయారు. కాసేపటికి తేరుకుని తమ ఆరాధ్య దైవం కళ్లెదుటే ప్రత్యక్షం కావడంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సంఘటన మంగళవారం ఇక్కడి బాంద్రా ప్రాంతంలో జరిగింది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న మెట్రో స్థలంలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతుండగా సచిన్ నేరుగా కారు దిగి ఒక యువకుడి నుంచి బ్యాట్ అందుకోవడాన్ని సచిన్ ఆప్తమిత్రుడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రముఖంగా ప్రస్తావించాడు. 44 ఏళ్ల సచిన్ తెండూల్కర్ ఒక యువకుడి నుంచి బ్యాట్ అందుకుని ఐదు బంతులను ఎదుర్కొన్నాడు. అనంతరం ఆ యువకులంతా సచిన్‌ను చుట్టుముట్టి దేవుడే తమ వద్ద ప్రత్యక్షమయ్యాడని ఎంతో సంబరపడ్డారు. దీంతో సచిన్ ఆ యువకులతో సెల్ఫీలు దిగడంతో వారిలో ఆనందం మరింత రెట్టింపయ్యింది. గల్లీ యువకులతో కలసి క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ సరదాగా క్రికెట్ ఆడడం తమ చిన్ననాటి టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేసిన దృశ్యాలు కళ్లల్లో కదలాడుతున్నాయని భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబీ పేర్కొన్నాడు.