క్రీడాభూమి

మెయిన్ డ్రాకు చోప్రా, సిక్కీ జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఏప్రిల్ 12: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి జోడీ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించింది. మంగళవారం క్వాలిఫయర్స్ తొలి మ్యాచ్‌లో గువాంగ్ లియాంగ్ జాసన్ వాంగ్, ఇ లింగ్ ఎలైన్ చువా జోడీని 21-15, 21-11 తేడాతో ఓడించిన చోప్రా, సిక్కీ రెండో మ్యాచ్‌లో బిమో అది ప్రొకొసో, సిత్రా దేవి సరీ జోడీపై 21-13, 21-10 ఆధిక్యంతో విజయం సాధించి మెయిన్ డ్రాలో స్థానం సంపాదించారు. తర్వాతి రౌండ్‌లో వీరు ఇర్ఫాన్ ఫదిల్లా, వేణి అంగ్రానీ జోడీని ఎదుర్కొంటారు. అయితే, ఇదే విభాగం నుంచి పోటీపడిన ప్రజాక్తా సావంత్/ యోగేంద్ర కృష్ణన్ జోడీతోపాటు అరుణ్ విష్ణు, అపర్ణా బాలన్ జోడీ కూడా క్వాలిఫయర్స్ నుంచే నిష్క్రమించింది. ప్రజాక్తా, యోగేంద్ర జోడీ తొలి క్వాలిఫయర్‌లో చియాంగ్ హన్ లీ, చెంగ్ చియా జోడీని 21-15, 21-11 తేడాతో ఓడించింది. అయితే, రెండో క్వాలిఫయర్‌లో కో చి చాంగ్, సిన్ తియెన్ చాంగ్ జోడీని ఢీకొని 17-21, 21-17, 18-21 తేడాతో పరాజయంపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అరుణ్, అపర్ణా జోడీ 11-21, 17-21 తేడాతో షిన్ బాక్ చియోల్, చవో యూ జంగ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది.
పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, గురుసాయి దత్ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించలేకపోయారు. క్వాలిఫయర్స్ మొదటి మ్యాచ్‌లో విబొవో కో హెన్రింకోను 21-11, 21-10 తేడాతో సులభంగానే ఓడించిన ప్రణీత్ రెండో క్వాలిఫయర్‌లో సోనీ ద్వి కున్కొరో చేతిలో 18-21, 12-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. గురుసాయి దత్ మొదటి క్వాలిఫయర్‌లోనే జులెమీ జుల్క్ఫ్లి చేతిలో 14-21, 21-16, 17-21 తేడాతో ఓడాడు.
చివరి క్షణంలో నిర్ణయం..
ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ క్రీడాకారిణి, భారత సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ చివరి క్షణాల్లో టోర్నీ నుంచి వైదొలగింది. సుమారు ఏడాది కాలంగా వేధిస్తున్న కాలి మడమ గాయం కారణంగానే ఆమె ఈ టోర్నీలో పాల్గొనడం లేదని సమాచారం. మహిళల సింగిల్స్‌లో పోటీపడాల్సిన ఆమె ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకోవ డంతో, ఈ విభాగంలో భారత్ పోటీని మరో హైదరాబాదీ పివి సింధు ముందుకు తీసుకెళుతుంది. పురుషుల విభాగంలో అజయ్ జయరామ్, ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ టైటిల్ వేటలో కొనగుతారు. ఈ ముగ్గురూ ఇంకా రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేక పోవడంతో, అందరి దృష్టీ వీరిపైనే ఉంది.

అజ్లన్ షా హాకీ
భారత్ చేతిలో
పాకిస్తాన్ చిత్తు
ఇపో (మలేసియా), ఏప్రిల్ 12: అత్యంత కీలకమైన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసిన భారత హాకీ జట్టు అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. సుల్తాన్ అజ్లన్ షా హాకీ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఢీకొన్న భారత్ 5-1 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి, పతకం రేసులో కొనసాగే అవకాశాన్ని నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే, రేసు నుంచి వైదొలగడం ఖాయంకాగా, పాకిస్తాన్‌తో పోరు కావడంతో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టుపై ఒత్తిడి పెరిగింది. అభిమానులు అంచనాలు కూడా భారీగా ఉండడంతో ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తిని రేపింది. మ్యాచ్ నాలుగో నిమిషంలోనే మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేసి భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు. అయితే, మరో మూడు నిమిషాల్లోనే మహమ్మద్ ఇర్ఫాన్ ద్వారా పాకిస్తాన్‌కు ఈక్వెలైజర్ లభించింది. స్కోరు సమమైన వెంటనే భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఎస్‌వి సునీల్ మైదానంలో వేగంగా కదులుతూ, పాకిస్తాన్ రక్షణ వలయానికి చిక్కకుండా 10వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి, భారత్‌ను ఆధిక్యంలో నిలబెట్టాడు. అనంతరం కొద్దిసేపు పాకిస్తాన్ నంచి ప్రతిఘటన ఎదురైంది. కానీ, దానిని సమర్థంగా తిప్పికొట్టిన సునీల్ 41వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. 50వ నిమిషంలో తల్వీందర్ సింగ్, 54వ నిమిషంలో రూపీందర్ పాల్ సింగ్ గోల్స్ చేశారు. చివరి క్షణంలో పెనాల్టీ షూట్‌ను రూపీందర్ గోల్‌గా మలచలేకపోయాడు. లేకపోతే భారత్ 6-1 తేడాతో గెలిచి ఉండేది. మొత్తం మీద ఆరంభం నుంచి చివరి వరకూ ఆధిపత్యాన్ని కనబరచిన భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఈ జట్టు డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

వీనూ యాత్ర విషాదాంతం

విదిష, ఏప్రిల్ 12: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత మహిళా బైకర్ వీనూ చేపట్టిన సాహస యాత్ర విషాదాంతమైంది. విదిషకు సమీపంలోని గ్యరా స్పూర్ వద్ద వీనూ నడిపిస్తున్న మోటార్ సైకిల్ అదుపుతప్పి కింద పడడంతో ఆ మె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీనూ మృతి చెం దిందని ఆమెతో కలిసి ఈ యాత్రలో పాల్గొన్న రాజేష్ తివారీ చెప్పాడు. పొరపా టున మోటార్ సైకిల్ కిందపడిందని, ఆ సమయంలో తాను ఆమె వెనకాలే మరో మోటార్ సైకిల్‌పై ఉన్నానని తెలిపాడు.