క్రీడాభూమి

మాంటే కార్లో మాస్టర్స్ సెమీస్‌కు నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంటే కార్లో, ఏప్రిల్ 20: ప్రపంచ మాజీ నంబర్ వన్ రాఫెల్ నాదల్ ఇక్కడ జరుగుతున్న మాంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో సెమీస్ చేరాడు. గాయాల కారణంగా పలుమార్లు కెరీర్‌కు అంతరాయం ఏర్పడుతున్న తరుణంలో అతను మళ్లీ ఫామ్‌లోకి రావడం విశేషం. క్వార్టర్ ఫైనల్‌లో డామినిక్ థియేమ్‌ను 6-0, 6-2 తేడాతో చిత్తుచేసిన విధానం నాదల్ ప్రతిభకు నిదర్శనం. మూడో రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ వంటి అసాధారణ ఆటగాడిని ఓడించి సంచలనం సృష్టించిన థియేమ్ క్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ ధాటికి ఎదురునిలవలేకపోయాడు. ఏ మాత్రం ఎదురుదాడి చేయలేక చేతులెత్తేశాడు. కాగా, ఫైనల్‌లో స్థానం కోసం గ్రిగర్ దిమిత్రోవ్‌ను నాదల్ సెమీస్‌లో ఢీ కొంటాడు. మరో క్వార్టర్ ఫైనల్‌లో దిమిత్రోవ్ 6-4, 7-6 ఆధిక్యంతో డేవిడ్ గోఫిన్‌ను ఓడించాడు.