క్రీడాభూమి

ఆసీస్ క్రికెట్ కోచ్ ఎంపిక త్వరలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఏప్రిల్ 20: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ ఎంపిక త్వరలో జరగనుంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పాలక మండలి శుక్రవారం ప్రకటించింది. నిజానికి వివిధ అంశాలను చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశమైన సీఏ కోచ్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందని అంతా అనుకున్నారు. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లినప్పుడు చోటు చేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో, ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలు, జట్టు కెప్టెన్ స్టీవెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై ఏడాది చొప్పున సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. అయితే, కోచ్ డారెన్ లీమన్‌కు తెలియకుండానే బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం జరిగి ఉండదని, అతనిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం దుర్మార్గమని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో, లీమన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఆ వెంటనే కొత్త కోచ్ ఎంపికను సీఏ ముమ్మరం చేసింది. ఒకానొక దశలో జస్టిన్ లాంగర్ ఎంపిక పూర్తయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించిన సీఏ త్వరలోనే ఎంపిక జరుగుతుందని తన ప్రకటనలో పేర్కొంది. ఖచ్చితమైన వివరణ ఇవ్వకపోయినా, వచ్చేనెల మొదటి వారంలో కోచ్ ఎంపిక జరుగుతుందని సమాచారం. కాగా, జస్టిన్ లాంగర్‌తోపాటు జాసన్ గిలెస్పీ, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తదితరులు కూడా కోచ్ పదవికి రేసులో ఉన్నట్టు తెలుస్తున్నది.