క్రీడాభూమి

వరల్డ్ కప్‌కు వారం రోజులేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: వరల్డ్ కప్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టాలన్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నిర్ణయం సరైనదేనని, అయితే, కేవలం వారం రోజుల్లోనే దీనిని ముగించాలని నిర్ణయించడంలో ఏమాత్రం ఔచిత్యం లేదని భారత డేవిస్ కప్ మాజీ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ విమర్శించాడు. శుక్రవారం అతను పీటీఐతో మాట్లాడుతూ భారత్ వంటి దేశాల్లో టెన్నిస్ అభివృద్ధి చెందాలంటే, రాఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్ వంటి మేటి క్రీడాకారులు ఆడాల్సి ఉంటుందని అన్నాడు. అయితే, డేవిస్ కప్ ఫైనల్ ముగిసిన వెంటనే హడావుడిగా వారం రోజుల్లో 18 దేశాల మధ్య వరల్డ్ కప్‌ను నిర్వహించాలని తీర్మానించడంలో అర్థం ఏమిటని అతను ఐటీఎఫ్ అధికారులను ప్రశ్నించాడు. ఇటీవల ఒర్లాండోలో జరిగిన ఐటీఎఫ్ సర్వసభ్య సమావేశంలో డేవిస్ కప్ ఫైనల్ అనంతరం, 18 దేశాలు పోటీపడే వరల్డ్ కప్‌ను నిర్వహించాలని తీర్మానించారు. వీటిలో 16 వరల్డ్ గ్రూప్ డేవిస్ కప్ జట్లు నేరుగా అర్హత సంపాదిస్తాయి. మిగతా రెండు దేశాలను ఐటీఎప్ ఎంపిక చేస్తుంది. బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్పెయిన్ ఇంటర్నేషనల్ సాకర్ హీరో గేరార్డ్ పిక్ యాజమాన్యంలోని కాస్మస్ గ్రూప్ ఈ వరల్డ్ కప్‌ను నిర్వహించనుంది. ఆ సంస్థతో ఇప్పటికే ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, 25 సంవత్సరాల వ్యవధిలో మూడు బిలియన్ డాలర్ల మేరకు లాభం వస్తుందని అంచనా వేస్తున్నామని ఐటీఎప్ అధ్యక్షుడు డేవ్ హగెర్టీ ప్రకటించాడు. అతను చేసిన ఈ ప్రకటనపై ఆనంద్ అమృత్‌రాజ్ తీవ్రంగా స్పందించాడు. ఆటగాళ్లను ఈ విధంగా డబ్బు సంపాదన కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే పలు భారీ మార్పులకు లోనైన డేవిస్ కప్ టోర్నమెంట్ పేలవంగా మారిందని అన్నాడు. ఇప్పుడు వరల్డ్ కప్‌ను డేవిస్ కప్‌తో ముడిపెట్టడం, వారం రోజుల్లోనే ముగించాలని అనుకోవడం టెన్నిస్‌ను తీవ్రంగా నష్టపరిచే అంశాలేనని స్పష్టం చేశాడు. ఈ నిర్ణయాన్ని తక్షణం మార్చుకోవాలని, వరల్డ్ కప్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దాలని ఐటీఎఫ్ అధికారులకు ఆనంద్ అమృత్‌రాజ్ సూచించాడు.

చిత్రం.. ఆనంద్ అమృత్‌రాజ్