క్రీడాభూమి

మలింగపై ఎస్‌ఎల్‌సి ఆగ్రహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఏప్రిల్ 12: ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఏఏ టోర్నీల్లో ఆడాలో, వేటికి గైర్హాజరు కావాలో తానే సొంతంగా నిర్ణయించుకుంటున్నాడని ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగపై శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ఆగ్రహంతో ఉంది. అందుకే ముంబయి ఇండియన్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో అతను ఆడాల్సి ఉన్నప్పటికీ, ఇంత వరకూ నో ఆబ్జెక్షన్ సర్ట్ఫికెట్ (ఎన్‌ఒసి)ని జారీ చేయలేదు. మలింగ ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నాడని, కాబట్టి అతని గాయాలపై స్పష్టమైన అవగాహన వచ్చే వరకూ ఎన్‌ఒసిని జారీ చేయలేమని ఎస్‌ఎల్‌సి చైర్మన్ తిలంగ సుమతిపాల స్పష్టం చేశాడు. చాలకాలంగా మలింగ తనకు ఇష్టమైన టోర్నీల్లోనే ఆడుతున్నాడన్న విమర్శలున్నాయి. ఈఏడాది ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో శ్రీలంక దారుణంగా విఫలమైన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా ఎస్‌ఎల్‌సి అతనిని ఆదేశించినట్టు సమాచారం. అయితే, వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ అతను కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే, టి-20 వరల్డ్ కప్‌లో పాల్గొన్న జట్టులో అతనికి సెలక్టర్లు స్థానం కల్పించారు. కానీ, తాను పూర్తి ఫిట్నెస్‌తో లేనని పేర్కొంటూ అతను టి-20 వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు ఆడలేదు. ఆ టోర్నీలో లంక దారుణంగా విఫలమైంది. గాయంతో బాధపడుతున్నానని పేర్కొని, కోట్ల రూపాయలను సంపాదించుకునే ఐపిఎల్‌లో ఆడేందుకు అతను సిద్ధం కావడం ఎస్‌ఎల్‌సి అధికారుల ఆగ్రహానికి కారణమైంది. అతను పేర్కొన్న గాయాలనే ఉటంకిస్తూ, ఫిట్నెస్‌పై సంతృప్తి చెందే వరకూ అతనికి ఐపిఎల్‌లో ఆడేందుకు వీలుగా ఎన్‌ఒసి జారీ చేసే ప్రసక్తే లేదని సుమతిపాల తేల్చిచెప్పాడు. ఒకవేళ తమ మాట బేఖాతరు చేసి మలింగ ఐపిఎల్‌లో ఆడితే, ఆతర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని, అతను పూర్తిగా బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుందని హెచ్చరించాడు.