క్రీడాభూమి

వాట్సన్ సూపర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఏప్రిల్ 20: షేన్ వాట్సన్ సెంచరీతో చెలరేగగా, సురేష్ రైనా 46 పరుగులతో అతనికి చక్కటి మద్దతునిచ్చిన నేపథ్యం లో, రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన ఇండియన్ ప్రీమి యర్ లీగ్ (ఐపీఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్ల లో 5 వికెట్లకు 204 పరుగులు సాధించగలిగింది. అనంతరం బౌలర్లు రాణించడంతో, ప్రత్యర్థిని మరో 9 బంతులు మిగిలి ఉండగానే, 140 పరుగులకు ఆలౌట్ చేసి, 64 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. నాలుగో మ్యాచ్ ఆడిన చెన్నైకి ఇది మూడో విజయంకాగా, రాజస్థాన్‌కు ఐదు మ్యాచ్‌ల్లో మూడో పరాజయం కావడం గమనార్హం.
టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యా టింగ్‌కు దిగాల్సి వచ్చిందన్న ఒత్తిడి లేకుండా చెన్నై ఆటగాళ్లు పరుగుల వేట కొనసాగించారు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంబటి రాయుడు ఔటైనప్పటికీ, ఫస్ట్‌డౌన్ ఆటగాడు సు రేష్ రైనాతో కలిసి షేన్ వాట్సన్ స్కోరు బోర్డును ముందుకు న డిపించాడు. రెండో 81 పరుగులు జోడించిన తర్వాత రైనా వికె ట్ కూలింది. అతను29 బంతుల్లో, తొమ్మిది ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి వెనుదిరిగాడు. మహేంద్ర సింగ్ ధోనీ (5), శామ్ బిల్లింగ్స్ (3) తక్కువ స్కోర్లకే గోపాల్ బౌలింగ్‌లో పెవిలి యన్ చేరారు. ఇన్నింగ్స్ ముగియడానికి మరో బంతి మిగిలి ఉండగా, బెన్ లాగ్లింగ్ బౌలింగ్‌లో జొస్ బట్లర్‌కు దొరికిపో యన వాట్సన్ 106 పరుగులు చేశాడు. 57 బంతులు ఎదుర్కొ న్న అతని స్కోరులో తొమ్మిది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయ. అతని వికెట్ కూలడంతో బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజా తాను ఎదుర్కొన్న ఒక బంతి రెండు పరుగులు చేశాడు. అతని తోపాటు నాటౌట్‌గా నిలిచిన డ్వెయన్ బ్రేవో 24 పరుగులు సా ధించడంతో చెన్నై స్కోరు 200 పరుగుల మైలురాయని అధిగ మించింది. 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్లకు 204 పరుగులు సాధించింది. గోపాల్‌కు మూడు, లాగ్లింగ్‌కు రెండు చొప్పున వికెట్లు లభించాయ.
జట్టు స్కోరు 20 పరుగుల వద్ద హెన్రిచ్ క్లాసెన్ (7) వికెట్ కూలడంతో మొదలైన రాజస్థాన్ కష్టాలు ఆతర్వాత కూడా కొన సాగాయ. నిలకడగా ఆడే సత్తా ఉన్న సంజూ శాంసన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, రెండు పరుగులకే వెనుదిరిగాడు. కెప్టె న్ అజింక్య రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద దీపక్ చాహర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపు ధాటిగా ఆ డిన జొస్ బట్లర్ 22 పరుగులు చేసి, డ్వెయన్ బ్రేవో బౌలింగ్‌లో ఇమ్రాన్ తాహిర్‌కు చిక్కడంతో రాజస్థాన్ సమస్యల్లో పడింది. బెన్ స్టోక్స్ ఒంటరి పోరాటానికి ఎవరి నుంచి సరైన మద్దతు రా లేదు. రాహుల్ త్రిపాఠీ (5) కూడా డ్వెయన్ బ్రేవో బౌలింగ్‌లోనే శామ్ బిల్లింగ్స్‌కు చిక్కాడు. 96 పరుగులకే రాజస్థాన్ 5 వికెట్లు చేజార్చుకుంది. క్రీజ్‌లో పాతుకుపోయ, చెన్నైకి సమస్యలు సృ ష్టిస్తూ, అర్ధ శతకానికి దగ్గరైన బెన్ స్టోక్స్‌ను ఇమ్రాన్ తాహిర్ ఔట్ చేశాడు. 37 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసిన స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ని శామ్ బిల్లింగ్స్ అందుకు న్నాడు. ఒక పరుగు చేసిన గౌతంను మహేంద్ర సింగ్ ధోనీ క్యా చ్ పట్టగా పార్ట్‌టైమ్ బౌలర్ షేన్ వాట్సన్ ఔట్ చేశాడు. స్టువర్ట్ బిన్నీ (10)ని శార్దూల్ ఠాకూర్ రిటర్న్ క్యాచ్ అందుకొని వెనక్కు పంపాడు. జయదేవ్ ఉనాద్కత్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కర్న్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్‌కాగా, తర్వాతి బంతికే బెన్ లా గ్లింగ్ వికెట్‌కీపర్ ధోనీ చక్కటి క్యాచ్ అందుకోవడంతో పెవిలి యన్ చేరాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌కు 18.3 ఓవర్లలో 140 పరు గుల వద్ద తెరపడింది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై సూపర్ కింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 204 (షేన్ వా ట్సన్ 106, సురేష్ రైనా 46, డ్వెయన్ బ్రేవో 24, బెన్ లాగ్లింగ్స్ 2/38, గోపాల్ 3/20).
రాజస్థాన్ రాయల్స్: 18.3 ఓవర్లలో 140 ఆలౌట్ (అజింక్య రహానే 16, బెన్ స్టోక్స్ 45, జొస్ బట్లర్ 22, దీపక్ చాహర్ 2/30, శార్దూల్ ఠాకూర్ 2/18, కర్న్ శర్మ 2/13, డ్వెయన్ బ్రేవో 2/16).