క్రీడాభూమి

లెగ్ స్పిన్నర్ల మాయాజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 21: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లెగ్ స్పిన్నర్లు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారని భారత క్రికెట్ క్రీడా దిగ్గజం, 1983 ప్రపంచ కప్ సారథ్యం వహించిన కపిల్ దేవ్ అన్నాడు. మన దేశంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు జరుగుతున్న పలు మ్యాచ్‌లలో లెగ్ స్పిన్నర్ల ఆటతీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించాడు. ఇక్కడ క్రికెట్‌పై జరుగుతున్న కామెడీ షో సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిచ్ ఎలాంటిదైనా భిన్న రీతుల్లో ప్రత్యర్థిపై లెగ్ స్పిన్ మాయాజాలంతో దాడి చేయడం గొప్ప విషయమని ఆయన అన్నాడు. ఆఫ్ స్పిన్నర్‌గా విజయవంతమైన క్రికెటర్‌గా వినుతికెక్కిన రవిచంద్రన్ అశ్విన్ (ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్) సైతం ఇపుడు లెగ్ స్పిన్‌పై దృష్టి సారించాడంటే లెగ్ స్పిన్నర్లు ఎలా దూసుకుపోతున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నాడు. ఐపీఎల్ ఆడుతున్న ప్రతి జట్టులోనూ లెగ్ స్పిన్నర్లు ఉంటున్నారంటే వాళ్లకుండే డిమాండ్ ఎలాంటిదో గ్రహించవచ్చునని అన్నాడు. ముంబయి ఇండియన్స్ టీమ్‌లో లెగ్ స్పిన్నర్లు ఎక్కువగా విజయవంతమైన క్రికెటర్లుగా రాణిస్తున్నారని, వారిలో రూర్కీ ఆటగాడు మయాంక్ మార్కండే ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ జట్టును బాగా ఆకట్టుకున్నాడని అన్నాడు. అదేవిధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోనూ ఆఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ బాగా పరిణితి చెందిన లెగ్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడని అన్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఆడుతున్న ముజీబ్ ఉర్ రహ్మాన్ కూడా మణికట్టు మాంత్రికుడిగా రాణిస్తుండగా, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో యజ్వేంద్ర చాహల్ లెగ్ విజయవంతమైన లెగ్ స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడని కపిల్ పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో కరణ్ శర్మ, ఇమ్రాన్ తాహీర్ వంటి వారు ఉన్నారని ఆయన తెలిపాడు. టీ-20 మ్యాచ్‌లనేవి బ్యాట్స్‌మెన్‌లు బాగా అనుకూలమని, కానీ ఐపీఎల్ మ్యాచ్‌లలో ప్రతిఒక్కరూ తమ ఆటతీరును అన్నివిధాలా మెరుగుపరచుకునేందుకు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డాడు.