క్రీడాభూమి

భారత బాక్సర్లకు ఆసియా క్రీడల్లో మరిన్ని పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: రానున్న ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు మరిన్ని పతకాలను మన దేశానికి అందించనున్నారని ప్రముఖ బాక్సర్, గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ విజేత వికాస్ కృష్ణన్ యాదవ్ అన్నాడు. గోల్డ్ కోస్ట్‌లో మన దేశం తరఫు6
న ఆడిన బాక్సర్లు తొమ్మిది పతకాలను గెల్చుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ త్వరలో జరుగబోయే ఆసియా క్రీడల్లో ఇదే ఉత్సాహం, పట్టుదలతో ఆడడం ద్వారా ఎక్కువ పతకాలను చేజిక్కుంచుకోవడం ఖాయమని వ్యాఖ్యానించాడు. గడిచిన కామనె్వల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన తన సహచర బాక్సర్ల ఆటతీరు భేషుగ్గా ఉందని ఆయన ప్రస్తుతించాడు. మహిళల బాక్సింగ్ 48 కేజీల విభాగంలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన బాక్సింగ్ దిగ్గజం ఎం.సీ.మేరీ కోమ్ గోల్డ్ మెడల్ గెల్చుకోవడం గర్వకారణమని ఆయన అన్నాడు.
కామనె్వల్త్ గేమ్స్‌తో ఆసియా క్రీడలను పోల్చకపోయినా ఆసియా క్రీడలను మినీ ఒలింపిక్స్ మాదిరిగా జరుగుతాయని, ఆయా పోటీదారుల మధ్య గట్టి పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. థాయిలాండ్, ఉత్తర కొరియా, జపాన్, ఫిలిప్పీన్స్, మంగోలియా, చైనా, కజకిస్తాన్, ఉజ్జెకిస్తాన్, టర్క్‌మెనిస్తాన్ వంటి దేశాలకు చెందిన బాగా పరిణితి చెందిన బాక్సర్లు ఆసియా క్రీడల్లో పాల్గొనున్నందున గట్టి పోటీ తప్పదని ఆయన పేర్కొన్నాడు. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బాక్సర్లంతా ఆటతీరును మరింత బాగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని, కనీసం ఒక గోల్డ్ మెడల్‌నైనా సాధించే దిశగా పోరాడాలని ఆయన అన్నాడు. గత ఆసియా క్రీడల్లో తనతోపాటు సతీష్ మాత్రమే రెండు పతకాలు సాధించామని, ఈసారి కనీసం నాలుగైదు పతకాలు సాధిస్తామనే దీమాను ఆయన వ్యక్తం చేశాడు.