క్రీడాభూమి

ఐదు నగరాల్లో కిర్‌స్టెన్ టాలెంట్ హంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: భారత దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో టాలెంట్ హంట్‌ను నిర్వహించి, ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎంపిక చేస్తామని, వారికి దక్షిణాఫ్రికాలోని తన అకాడెమీలో ప్రత్యేక శిక్షణనిప్పిస్తామని భారత మాజీ కోచ్ గారీ కిర్‌స్టెన్ తెలిపాడు. శనివారం అతను పీటీఐతో మాట్లాడుతూ ఈనెల 28, 29 తేదీల్లో బెంగళూరులో టాలెంటర్ హంట్ ఉంటుందని చెప్పాడు. అదే విధంగా పుణే (మే 14, 15), ఢిల్లీ (మే 10, 11), చెన్నై (మే 14, 15), జైపూర్ (మే 17, 18) నగరాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని 2011లో టీమిండియా వరల్డ్ కప్‌ను గెల్చుకున్న తర్వాత కోచ్ పదవి నుంచి వైదొలగిన కిర్‌స్టెన్ తెలిపాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, తన తర్వాత కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న డంకన్ ఫ్లెచర్ అద్భుతమైన మార్గదర్శకం చేశాడని, అతను తీసుకున్న నిర్ణయాలు, ఆటగాళ్లను మలచిన తీరు ఇప్పుడు ఫలాలనిస్తున్నదని అన్నాడు. సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్ వంటి యోధానుయోధులు కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత, టీమిండియాను గతంలో మాదిరిగానే బలంగా రూపుదిద్దడం కోసం డంకన్ ఫ్లెచర్ నిరంతరం శ్రమించాడనడానికి జట్టు ఇప్పుడున్న తీరే నిదర్శమని పేర్కొన్నాడు. ఒక జట్టు సాధించిన విజయాలు, గణాంకాలను బట్టి కోచ్ సఫలమయ్యాడా లేక విఫలమయ్యాడా అని నిర్ణయిస్తుంటారని, కానీ ఆ విధంగా మైదానంలోని వెల్లడైన ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం ఎంతమాత్రం సరైన విధానం కాదని స్పష్టం చేశాడు. జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలు, అమలు చేసిన నిర్ణయాలు అప్పటికప్పుడే ఫలితాలను ఇవ్వాలని కోరుకోవడంలో అర్థం లేదని గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న కిర్‌స్టెన్ అన్నాడు. భారత్‌లో ప్రతిభావంతులకు లోటు లేదని, అందుకే, ఇక్కడ టాలెంట్ హంట్‌ను కొనసాగిస్తున్నామని తెలిపాడు. సమయం దొరికిన ప్రతిసారీ భారత్‌కు వస్తుంటానని అన్నాడు.

చిత్రం..భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గారీ కిర్‌స్టెన్