క్రీడాభూమి

పోరాడి ఓడిన సన్‌రైజర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఇదివారం ఇక్కడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు కెప్టెన్ విలియమ్‌సన్ శ్రమ వృథా అయింది. దీంతో ఈ జట్టుకు ఇది రెండో ఓటమి. స్టార్ బ్యాట్స్‌మెన్లు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. కాగా, చెన్నై జట్టులో అంబటి రాయుడు 79, సురేష్ రైనా 54 అత్యధికంగా పరుగులు చేయడం విశేషం. మీడియం పేసర్ దీపక్ చాహర్ నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన చెన్నై జట్టు స్కోరు 14 పరుగుల వద్ద షేన్ వాట్సన్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. 15 బంతులు ఎదుర్కొన్న వాట్సన్ ఒక సిక్సర్‌తో తొమ్మిది పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఫఫ్ డుప్లెసిస్ 13 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 11 పరుగులు చేయగా, అతనిని రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సాహా స్టంపవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సురేష్ రైనా, అంబటి రాయుడు పరుగుల వరద సృష్టించారు. రాయుడు 37 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, తొమ్మిది బౌండరీల సహాయంతో 79 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రైనా 43 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో 54 పరుగులు, కెప్టెన్/వికెట్ కీపర్‌గా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.ఎస్.్ధని 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు బౌండరీల సహాయంతో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ జట్టులో భువనేశ్వర్ కుమార్ మూడు ఓవర్లలో 22 పరుగులిచ్చి ఒక వికెట్, రషీద్ ఖాన్ నాలుగు ఓవర్లలో 49 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రత్యర్థి తమ ముందుంచిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ప్రారంభంలోనే రికీ బుల్ వికెట్‌ను కోల్పోయిన సన్‌రైజర్స్ జట్టును కెప్టెన్ కనే విలియమ్‌సన్ అత్యధిక పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. రికీ బుల్ ఐదు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే చాహర్ బౌలింగ్‌లో షేన్ వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన మనీష్ పాండే రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే డి.చాహర్ బౌలింగ్‌లో కరణ్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. దీపక్ హుడా ఏడు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి డి. చాహర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. షాకీబ్ అల్ హసన్ 19 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీల సహాయంతో 24 పరుగులు చేసి కరణ్ శర్మ బౌలింగ్‌లో సురేష్ రైనా క్యాచ్‌కు దొరికిపోయాడు. కెప్టెన్ విలియమ్‌సన్ 51 బంతులు ఎదుర్కొని ఐదు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో బౌలర్లపై విరుచుకుపడి 84 పరుగులు చేశాడు. అయితే, ఇతను డీజే బ్రేవో బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. యూసుఫ్ పఠాన్ 27 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, ఒక బౌండరీతో 45 పరుగులు చేసి ఎస్.ఎన్.్ఠకూర్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఐదు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు, రషీద్ ఖాన్ నాలుగు బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, ఒక బౌండరీతో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. చెన్నై జట్టులో మీడియం పేసర్ దీపక్ చాహర్ నాలుగు ఓవర్లలో 15 పరుగులిచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నాడు. శార్ధూల్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్, కరణ్ శర్మ మూడు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్, డ్వేన్ బ్రేవో మూడు ఓవర్లలో 37 పరుగులిచ్చి ఒక వికెట్ చేజిక్కించుకున్నారు. అయితే, హైదరాబాద్ జట్టులో ఒకరిద్దరు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన పరుగులు చేయలేకపోవడంతో జట్టు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.

చిత్రం..సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంతో తన సహచర జట్టు ఆటగాళ్లతో కలసి గెలుపు సంబరాలు జరుపుకుంటున్న చెన్నై కెప్టెన్ ధోని