క్రీడాభూమి

సర్ఫ్‌రాజ్‌కు పెరిగిన స్టార్‌డమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 13: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యువ బ్యాట్స్‌మన్ సర్ఫ్‌రాజ్ ఖాన్ ఒకేసారి సూపర్ స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇండియన్ ప్రీమియల్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 10 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 35 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. నిన్నమొన్నటి వరకూ అతని గురించి పెద్దగా తెలియనివారు, పట్టించుకోనివారు కూడా ఈ యువ బ్యాట్స్‌మన్‌ను ఆసక్తిగా గమనించడం ఆరంభించారు. గత ఏడాది, తన 17వ ఏట అతను సరికొత్త రికార్డుతో ఐపిఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఐపిఎల్ టోర్నీలో ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా అతని పేరు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఈ ఏడాది తొలి మ్యాచ్‌లోనే వీరవిహారం చేసి, బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 227 పరుగుల భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. సర్ఫ్‌రాజ్ షాట్లను ఎంపిక చేసుకునే విధానాన్ని చూసి తాను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానని బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ప్రశసించాడంటే అతని బ్యాటింగ్ నైపుణ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. సన్‌రైజర్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ యువ బ్యాట్స్‌మన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. చివరి క్షణాల్లో అతను వీరవిహారం చేయడంతో బెంగళూరు అత్యంత కీలకమైన పరుగులు రాబట్టుకుందని, ఫలితంగా భారీ స్కోరును సాధించగలిగిందని పేర్కొన్నాడు. అభిమానులు కూడా అతని ప్రతిభకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సర్ఫ్‌రాజ్ తండ్రి నౌషాద్ ముంబయిలో స్థిరపడ్డాడు. అక్కడే సర్ఫ్‌రాజ్ క్రికెట్‌లో పాఠాలు నేర్చుకున్నాడు. ఒకసారి మాటల సందర్భంగా ‘అబ్బూ.. అర్జున్ కిత్నా నసీబ్‌వాలా హైనా? ఉనే సచిన్ సర్‌కా బేటాహై.. ఉనే్కపాస్ గాడియా, ఐపాడ్స్.. సబ్‌కుఛ్ హై’ (నాన్నా.. అర్జున్ ఎంతో అదృష్టవంతుడుకదా. అతను సచిన్ తెండూల్కర్ కొడుకు కదా.. అతని వద్ద కార్లు, ఐపాడ్స్.. అన్నీ ఉంటాయి) అని తండ్రితో అన్నాడు. ఆ క్షణం నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా సర్ఫ్‌రాజ్ క్రికెట్ కోచింగ్‌ను కొనసాగించాలని నౌషాద్ నిర్ణయించుకున్నాడు. సర్ఫ్‌రాజ్ కూడా తండ్రి శ్రమను వృథాకానివ్వలేదు. భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. ముంబయి తరఫున రంజీ ట్రోఫీలో ఆడాడు. తన తండ్రి స్వస్థలమైన ఉత్తర ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాలని అనుకుంటున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఢీకొన్న భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. సర్ఫ్‌రాజ్ ఒక్కడే 51 పరుగులు చేసి, జట్టును ఆదుకునేందుకు చెమటోడ్చాడు. విండీస్ 49.3 ఓవర్లలో ఐదు వికెట్లకు 146 పరుగులు సాధించి విజయభేరి మోగించింది. భారత్ అండర్-19 జట్టు రన్నరప్ ట్రోఫీకే పరిమితమైనప్పటికీ, సర్ఫ్‌రాజ్ రూపంలో ఒక గొప్ప బ్యాట్స్‌మన్ అతవరించాడు. ఆ టోర్నీలో అతని కెనడాపై 48, పాకిస్తాన్‌పై 81, ఐర్లాండ్‌పై 74, న్యూజిలాండ్‌పై 74, నేపాల్‌పై 21 (నాటౌట్), నమీబియాపై 76, శ్రీలంకపై 59 చొప్పున పరుగులు సాధించి సత్తా నిరూపించుకున్నాడు. జాతీయ జట్టుకు ఎంపికయ్యే ప్రతిభాపాటవాలు పుష్కలంగా ఉన్న సర్ఫ్‌రాజ్ ఈసారి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడుతున్నాడు.