క్రీడాభూమి

పంజాబ్ ఖాతాలో మరో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్‌ను ఎంచుకోవడంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్‌ను ప్రారంభించి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ప్రస్తుత సీజన్‌లో కేవలం ఒక మ్యాచ్‌లో ఓటమి, మిగిలిన మ్యాచ్‌లన్నింటిలో గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ భారీ స్కోరు చేయకుండా ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. ప్రత్యర్థి తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉండగా శ్రేయాస్ అయ్యర్ ముజీబ్ బౌలింగ్‌లో ఫించ్ చేతికి చిక్కడంతో మ్యాచ్ పంజాబ్‌ను వరించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో ఢిల్లీ వరుస పరాజయాలను మూటకట్టుకుంది. శ్రేయాస్ అయ్యర్ (57) శ్రమ వృథా అయ్యింది. ఢిల్లీ జట్టులో లామ్ ప్లుంకెట్ 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
పంజాబ్ జట్టులో అరోన్ పింఛ్ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ 15 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు బౌండరీల సహాయంతో 23 పరుగులు చేశాడు. ప్లుంకెట్ బౌలింగ్‌లో అవేష్ ఖాన్ క్యాచ్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుతిరిగాడు. 16 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో 21 పరుగులు చేసి మయాంక్ అగర్వాల్ బౌల్డ్ అయ్యాడు. యువరాజ్ సింగ్ 17 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 14 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 32 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతో 34 పరుగులు చేసిన కరణ్ నాయర్ ప్లుంకెట్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చాడు. డేవిడ్ మిల్లర్ 19 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో బౌండరీతో 26 పరుగులు చేశాడు. క్రిష్టియన్ బౌలింగ్‌లో ప్లుంకెట్ క్యాచ్ ఇచ్చిన డేవిడ్ మిల్లర్ పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఏడు బంతులు ఎదుర్కొని ఆరు పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో రాహుల్ తెవాతియాకు క్యాచ్ ఇచ్చాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ఆండ్రూ టై కేవలం మూడు పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. బరీందర్ శరణ్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు.
ఇక ఢిల్లీ జట్టులో లామ్ ప్లుంకెట్ నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి మూడు వికెటు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ మూడు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు, అవేష్ ఖాన్ నాలుగు ఓవర్లలో 36 పరుగులిచ్చి రెండు, డేనియల్ క్రిస్టియన్ మూడు ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో పృథ్వీ షా 10 బంతులు ఎదుర్కొని నాలుగు బౌండరీలతో 22 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసిన కెప్టెన్ గౌతం గంభీర్‌ను ఆండ్రూ టై బౌలింగ్‌లో అరోన్ పింఛ్ క్యాచ్ పట్టి పెవిలియన్ దారిపట్టించాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 10 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక బౌండరీతో 12 పరుగులు చేశాడు. రాజ్‌పుఠ్ బౌలింగ్‌లో ఆండ్రూకి క్యాచ్ ఇచ్చి మాక్స్‌వెల్ వెనుతిరిగాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏడు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 11 బంతులు ఎదుర్కొన్న డేనియన్ క్రిస్టియన్ ఆరు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రాహుల్ తెవాతియా 21 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి ఆండ్రూ టై బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఒక బంతిని ఎదుర్కొన్న లామ్ ప్లుంకెట్ పరుగులేమీ చేయకుండానే బరీందర్ శ్రవణ్ బౌలింగ్‌లో కరణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. శ్రేయాస్ అయ్యర్ 45 పరుగులు చేసి ఒక సిక్సర్, ఐదు బౌండరీలతో 57 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అమిత్ మిశ్రా రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
పంజాబ్ జట్టులో అంకిత్ రాజ్‌పుట్ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు, ఆండ్రూ టై నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి రెండు, ముజీబ్ ఉర్ రహ్మాన్ నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. బరీందర్ శరణ్ నాలుగు ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు.
సంక్షిప్త స్కోరు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143. (కరణ్ నాయర్ 34, డేవిడ్ మిల్లర్ 26, లోకేష్ రాహుల్ 23, మయాంక్ అగర్వాల్ 21, లామ్ ప్లుంకెట్ 3/17, ట్రెంట్ బౌల్ట్ 2/21, అవేష్ ఖాన్ 2/36).
ఢిల్లీ డేర్ డెవిల్స్: 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 139. (శ్రేయాస్ అయ్యర్ 57, రాహుల్ తెవాట్లా 24, పృథ్వీ షా 22, అంకిత్ రాజ్‌పుట్ 2/23, ఆండ్రూ టై 2/25, ముజీబ్ ఉర్ రహ్మాన్ 2/25).

చిత్రం..ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై విజయంతో పంజాబ్ క్రికెటర్లు