క్రీడాభూమి

నిరాశపరిచిన జోస్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్ గౌనా (ఈజిప్టు), ఏప్రిల్ 25: ఇక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ పీఎస్‌ఏ వరల్డ్ సిరీస్‌లో భారత స్క్వాష్ క్రీడాకారిణి జోస్న చిన్నప్ప నిరాశపరిచింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె నాలుగో సీడ్ ఇంగ్లాండ్‌కు చెందిన లారా మసారో చేతిలో ఓడిపోయింది. 16వ సీడ్ క్రీడాకారిణి అయిన జోస్న తొలుత ఎనిమిదిసార్లు వరల్డ్ చాంపియన్ నికోల్ డేవిడ్‌ను ఓడించినా క్వార్టర్ ఫైనల్స్‌లో 23 నిమిషాలపాటు జరిగిన స్ట్రయిట్ గేమ్‌లో 11-4, 11-8, 11-2తో మసారో చేతిలో ఓడిపోయింది. మిగిలిన భారత క్రీడాకారిణులు డ్రా చేసుకోగా, దీపికా పల్లికల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో క్యామిలీ సెర్మె చేతిలో ఓడిపోయింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో జోస్న, పల్లికల్ డబుల్స్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించారు.