క్రీడాభూమి

భారత్‌తో తొలిటెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 25: భారత్‌లో టెస్టు మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలెట్టాలని ఎంతోకాలంగా తాము ఎదురుచూస్తున్న కల నిజమవుతున్నందుకు ఆనందంగా ఉందని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీక్ స్టానిక్‌జల్ అన్నాడు. అయితే, టీమిండియాతో జరిగే ఈ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీని ఢీకొనాలన్న ఆశ నెరవేరడం లేదని ఆయన వ్యాఖ్యానించాడు. అఫ్గానిస్తాన్‌తో ఒకే ఒక టెస్టుమ్యాచ్ ఈ ఏడాది జూన్ 14న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమవుతుంది. కానీ ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ సర్రేతో జరిగే కౌంటీ క్రికెట్‌లో ఇంగ్లాండ్ తరఫున ఆడనున్నాడు. దీంతో అఫ్గానిస్తాన్-్భరత్ మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ ఆడే అవకాశం లేదు. టీమిండియాలో భారత్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడాలనే కల ఎంతో కాలం నుంచి ఉందని ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ అన్నాడు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని, ఆ కల ఇపుడు ఈడేరనుందని అంటూ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడైన కోహ్లీతో తమ జట్టు క్రికెటర్లు ఆడే అవకాశం లేకపోవడం ఒకవిధంగా అతనిని తాము ‘మిస్’ అవుతున్నామేమోనన్న భావన తమవాళ్లలో కలుగుతోందని ఆయన అన్నాడు. ఏదేమైనా అరుదైన అవకాశం తమకు వచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకుంటామని దీమా వ్యక్తం చేశాడు.