క్రీడాభూమి

జీతం వదులుకోనున్న గంభీర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 25: ఢిల్లీ డేర్ డెవిల్స్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ తన జీతం మొత్తం 2.8 కోట్ల రూపాయలను వదులుకోనున్నాడా? ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా సమర్ధవంతంగా జట్టును నడపలేకపోవడంతోపాటు వైఫల్యాలకు నైతిక బాధ్యతగా అతను కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జట్టు వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహిస్తూ ఈ సీజన్‌లో తమ ఫ్రాంచైజీ తనకు వివిధ రూపాల్లో అందజేసే 2.8 కోట్ల రూపాయలను తీసుకోకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా మిగిలిన మ్యాచ్‌లలో మాత్రం గంభీర్ ఆడతాడు.