క్రీడాభూమి

బౌలర్ల వైఫల్యమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 26: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు వైఫల్యం చెందడంతో రాయల్ చాలెంజర్స్ ఓటమిపాలైందని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో లయ తప్పిన బౌలర్లు, మ్యాచ్ చివర్లో అత్యధికంగా పరుగులివ్వడంతోనే జట్టు ఓటమి పాలైందని చెప్పాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో డివిలియర్స్ 68, డికాక్ 53 పరుగులతో అర్థ సెంచరీలు సాధించడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అందుకు జవాబుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోని 70 నాటౌట్, అంబటి రాయుడు 82 పరుగులు చేయడంతో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో చెన్నై విజయాన్ని నమోదు చేసింది. చెన్నై విజయం సాధించడానికి చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉంది. ఈ తరుణంలో బౌలింగ్ వేసిన హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ వరుసగా మూడు వైడ్లు వేయడంతో చెన్నై జట్టుకు ఊపిరి పోసినట్లయింది. 19వ ఓవర్లో సిరాజ్ 14 పరుగులిచ్చాడు. దీంతో చెన్నై చివరి ఓవవర్లో విజయం కోసం 16 పరుగులు చేయాల్సి వచ్చింది. 20వ ఓవర్ వేసిన కోరె అండర్సన్ బౌలింగ్‌లో బ్రేవో వరుసగా బౌండరీ, సిక్స్ కొట్టగా, నాలుగో బంతిలో ధోనీ భారీ షాట్‌తో ఆట ముగిసింది. విజయం చెన్నైని వరించింది.

స్లో ఓవర్ రేటు కోహ్లీకి రూ.12 లక్షల ఫైన్
బెంగళూరు, ఏప్రిల్ 26: చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 12 లక్షల రూపాయల ఫైన్ విధించారు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయిన బెంగళూరు 205 పరుగులు చేసినా, చెన్నై కెప్టెన్ ఎం.ఎస్.్ధని తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 34 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్ వేయడంలో కోహ్లీ సేన విఫలం కావడంతో ఈ జరిమానా విధించారు.