క్రీడాభూమి

చాంపియన్‌షిప్ ట్రోఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 26: అంతర్జాతీయ క్రికెట్ (ఐసీసీ) నిర్వహించే ట్రోఫీల్లో చాంపియన్‌స ట్రోఫీ ఒకటి. అయతే, ఆ వనే్డ ట్రోఫీ ఇకనుంచి కనిపించే అవకాశాలు లేనట్టే. 50 ఓవర్ల చాంపియన్ ట్రోఫీని 2021 చాంపియన్ ట్రోఫీ వరల్డ్ టీ-20గా మార్చుతున్నట్టు ఐసీసీ తాజాగా నిర్ణయించింది. ఈ కొత్త నిర్ణయంతో చాంపియన్ ట్రోఫీ స్థానంలో రెండు వరల్డ్ టీ20లు జరపనున్నారు. సాధారణంగా చాంపియన్ ట్రోఫీలో ఉండే ఎనిమిది టీమ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇక ఉండదు. దీనికి బదులుగా వరల్డ్ టీ-20 ద్వారా 16 జట్లను ఆడించేందుకు ఐసీసీ గవర్నింగ్ బాడీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ విషయంపై ఐదు రోజులపాటు జరిగిన సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు సైతం హాజరై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. సమావేశం అనంతరం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 50 ఓవర్ల చాంపియన్ ట్రోఫీని వరల్డ్ టీ-20గా మార్చేందుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలిపాడు. ఆస్ట్రేలియాలో 2020లో ఐసీసీ వరల్డ్ టీ-20, 2021లో భారత్‌లో ఐసీసీ వరల్డ్ టీ-20 నిర్వహించనున్నారు. భారత్‌లో నిర్వహించే చాంపియన్ ట్రోఫీని ఇక ముందు వరల్డ్ టీ-20గా మారుతుందని రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు. 2019, 2023లో వనే్డ ఇంటర్నేషనల్ కప్ జరుగుతుంది.

భారత మహిళా క్రికెట్‌కు అద్దెపై బౌలింగ్ కోచ్?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: భారత మహిళా క్రికెట్‌లో బౌలింగ్ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసేందుకుగాను అద్దె ప్రాతిపదికన బౌలింగ్ కోచ్‌ను తీసుకోనుంది. ఈమేరకు బీసీసీఐ తగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న బరోడా ఆల్‌రౌండర్ తుషార్ ఆరోథ్ నుంచి క్రికెటర్లు తగిన మెలకువలు నేర్చుకుంటున్నారు. తుషార్ 6105 ఫస్ట్‌క్లాస్ రన్స్ చేయడంతోపాటు 225 వికెట్లు తీసుకున్నాడు. ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న బిజూ జార్జ్ కూడా తన శక్తియుక్తులను ఉపయోగించి జట్టుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. అయితే, జట్టు మేనేజిమెంట్ మాత్రం బౌలింగ్ కోచ్ ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడుతోందని బీసీసీఐకి చెందిన ఒక సీనియర్ అధికారి పీటీఐకి తెలిపాడు. బౌలింగ్ కోచ్‌గా రావాలనుకునేవారికి అంతర్జాతీయ వేదికలపై రాణించిన అనుభవం తప్పనిసరి కాదని ఆ అధికారి స్పష్టం చేశాడు. ప్రస్తుత హెడ్ కోచ్‌కు సైతం అంతర్జాతీయ వేదికలపై రాణించిన అనుభవం లేని విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఆసియా కప్‌లో పాల్గొనే జట్టును ఈ వారం తర్వాత ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో గత ఏడాది జూలైలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత నుంచి ఇప్పటివరకు జట్టు మిక్స్‌డ్ రన్స్ చేస్తోందని ఆయన తెలిపాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ వనే్డ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో ఆతిధ్య జట్టును మట్టి కరిపించి, కప్‌ను కైవసం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. అయితే, స్వదేశంలో వనే్డ సిరీస్‌తోపాటు గత నెలలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో టీ-20 ట్రై సిరీస్‌లో భాగంగా ఇదే జట్టుపై ఆడిన సందర్భంగా ఫైనల్‌లో భారత్ జట్టు విఫలమైందని ఆయన పేర్కొన్నాడు.