క్రీడాభూమి

రాహుల్ ద్రవిడ్‌కు ద్రోణాచార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కోహ్లీకి ఖేల్ రత్న, గవాస్కర్‌కు ధ్యాన్‌చంద్ * కేంద్రానికి బీసీసీఐ ప్రతిపాదనలు
కోల్‌కతా, ఏప్రిల్ 26: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు ప్రతిష్ఠాత్మకమైన ద్రోణాచార్య అవార్డు ఇవ్వాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదేవిధంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, క్రికెట్‌లో దిగ్గజ ఓపెనర్ సునీల్ గవాస్కర్‌కు ధ్యాన్ చంద్ లైఫ్‌టైల్ ఆచీవ్‌మెంట్ అవార్డు ఇవ్వాలని బీసీసీఐ ప్రతిపాదనలు పంపింది. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ సైతం ద్రవిడ్‌కు ద్రోణాచార్య పురస్కారానికి ప్రతిపాదించిన విషయాన్ని నిజమేనని అన్నాడు. వివిధ కేటగిరిలలో నామినేషన్లను ప్రభుత్వానికి పంపిన విషయాన్ని ఆయన పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో అండర్-19 క్రికెట్ జట్టు ఇటీవల వరల్డ్ కప్ సాధించింది. ఇండియా-ఏ టీమ్‌తోపాటు జూనియర్ క్రికెట్‌తో పనిచేస్తూ వారి మధ్య ద్రవిడ్ వారధిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ కోచ్ రాజ్‌కుమార్‌కు శర్మ గతంలో ద్రోణాచార్య అవార్డును అందుకున్నాడు. అతని పేరును బీసీసీఐ ప్రతిపాదించకపోయినా వ్యక్తిగత నామినేషన్ల విభాగంలో అతనికి ద్రోణాచార్య అవార్డు దక్కింది. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కోసం ప్రతిపాదించడం ఇది రెండోసారి. 2016లో కోహ్లీ పేరును ఈ పురస్కారం కోసం పంపినా రియో ఒలింపిక్స్‌లో మంచి విజయాలను నమోదు చేసిన పీవీ సింధు, సాక్షి మాలిక్‌తోపాటు తృటిలో పతకం చేజార్చుకున్న దీపా కర్మాకర్‌కు ఈ అవార్డులను ప్రకటించారు. గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు రాకపోవడంతో ఈసారి కోహ్లీ పేరును మళ్లీ ప్రతిపాదించారు. ఇక సునీల్ గవాస్కర్ విషయానికొస్తే భారత క్రికెటర్‌గా అపార అవకాశాలను అందిపుచ్చుకుని సమర్థవంతమైన ఆటగాడిగా రాణించినందుకు ధ్యాన్ చంద్ పురస్కారానికి ప్రతిపాదించారు. గవాస్కర్‌కు ఇంతకుముందు అర్జున అవార్డు లభించింది.