క్రీడాభూమి

భామ్రి, బోపన్నకు అర్జున అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టెన్నిస్ సింగిల్స్ విభాగంలో అగ్రపథాన కొనసాగుతున్న యుకీ భామ్రి, డబుల్త్ విభాగంలో రాణిస్తున్న రోహన్ బోపన్నలకు అర్జున అవార్డుల కోసం ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఈ ఇద్దరు టెన్నిస్ క్రీడారుల పేర్లను ప్రతిపాదించిన విషయాన్ని ఏఐటీఏ సెక్రెటరీ జనరల్ హిరణ్మయి ఛటర్జీ స్పష్టం చేశాడు. యుకీ ఇటీవల కాలంలో తన ఆటతీరుతో బాగా రాణించి టాప్-10 స్థానంలో నిలబడడంతోపాటు తన కెరీర్‌లోనే 83 బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ ఘనతతోనే అతని పేరును టెన్నిస్ సింగిల్స్ విభాగంలో అర్జున అవార్డుకు ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నాడు. అర్జున అవార్డుకు తన పేరును ప్రతిపాదించడం పట్ల యుకీ మాట్లాడుతూ ఇది తన పనితీరుకు వచ్చిన గుర్తింపుగా అభివర్ణించాడు. ఇక బోపన్న గత ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో ఘన విజయాన్ని నమోదు చేశాడు. వాస్తవానికి గత ఏడాదే బోపన్న పేరును అర్జున అవార్డుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినా అప్పటికే నామినేషన్ల దాఖలుకు డెడ్‌లైన్ పూర్తికావడంతో అవకాశం చేజారింది. పాయింట్ల విధానాన్ని అనుసరించి గ్రాండ్ శ్లామ్ సాధించడమంటే వరల్డ్ చాంపియన్‌షిప్ దక్కించుకున్న ఘనత వస్తుంది. బోపన్న తప్పకుండా ఈ కోవలోకి వస్తాడు. గత కొనే్నళ్లుగా అతను నిలకడగా ఆడుతున్నాడని, ఎంతోమంది అర్జున అవార్డు రావాలని కోరుకుంటున్నా బోపన్న అందుకు అర్హుడని టెన్నిస్ స్టార్ ఆటగాడు యుకీ భాంబ్రి పేర్కొన్నాడు.