క్రీడాభూమి

రొనాల్డో హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, ఏప్రిల్ 13: సూపర్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్‌తో రాణించడంతో, ఊల్ఫ్స్‌బర్గ్‌ను 3-0 తేడాతో చిత్తుచేసిన రియల్ మాడ్రిడ్ చాంపియన్స్ లీగ్ సాకర్ టోర్నీ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ జట్టు సెమీస్ చేరడం వరుసగా ఇది ఆరోసారి. రొనాల్డో మొదటి గోల్ చేసిన తర్వాత నిమిషం వ్యవధిలోనే మరో గోల్‌ను నమోదు చేయడం విశేషం. రియల్ మాడ్రిడ్ ఇప్పటి వరకూ 10 పర్యాయాలు చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను గెల్చుకుంది. ఇలావుంటే, పారిస్ జెయంట్స్‌పై 1-0 తేడాతో గెలిచిన మాంచెస్టర్ సిటీ జట్టు కూడా సెమీస్‌లో స్థానం సంపాదించింది. 76వ నిమిషంలో కెవిన్ డి బ్రూ యెన్ కీలకమైన ఈ గోల్ సాధించాడు.