క్రీడాభూమి

సూపర్ రోహిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 13: ఈసారి ఐపిఎల్ మొదటి మ్యాచ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్న డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 187 పరుగులు సాధించగా, మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ముంబయి గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో, పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 84 పరుగులు చేసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది. గౌతం గంభీర్ 52 బంతుల్లో 64 (నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), మనీష్ పాండే 29 బంతుల్లో 52 (మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), ఆండ్రె రసెల్ 17 బంతుల్లో 36 (ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) పరుగులు చేసి, నైట్ రైడర్స్‌కు గౌరవ ప్రదమైన స్కోరును అందించగలిగారు. ముంబయి బౌలర్ మిచెల్ మెక్‌లీనగన్ 25 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్య, హర్భజన్ సింగ్ చెరొక వికెట్ కూల్చారు.
నైట్‌రైడర్స్‌ను ఓడించడానికి ఇన్నింగ్స్ ఆరంభించిన ముంబయికి పార్థీప్ పటేల్, రోహిత్ శర్మ శుభారంభాన్నిచ్చారు. 5.5 ఓవర్లలో 53 పరుగులు జోడించారు. 20 బంతుల్లో 23 పరుగులు చేసిన పటేల్ రనౌట్‌కావడంతో ముంబయి తొలి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ నిలదొక్కుకొని ఆడుతుండగా, హార్ధిక్ పాండ్య 9, మెక్‌క్లీనగన్ 20 పరుగులు చేసి అవుటయ్యారు. చివరి రెండు ఓవర్లలో ముంబయి విజయానికి 18 పరుగుల దూరంలో నిలిచింది. రసెల్ వేసిన ఆ ఓవర్‌లో రోహిత్ ఏకంగా 17 పరుగులు సాధించాడు. బట్లర్ వికెట్ కూలింది. చివరి ఓవర్ మొదటి బంతికి కీరన్ పొలార్డ్ ఒక పరుగు చేయడంతో ముంబయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఐపిఎల్‌లో భాగంగా గురువారం రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్‌లో ఐపిఎల్‌లోకి అడుగుపెట్టిన రెండు కొత్త జట్లు గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ ఢీ కొంటాయి. ఈ రెండు జట్లు తమతమ మొదటి మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేయడం గమనార్హం. దీనితో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఆసక్తిని రేపుతున్నది.