క్రీడాభూమి

గ్రీజ్మన్ ‘డబుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, ఏప్రిల్ 14: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ బార్సిలోనాకు చుక్కెదురైంది. ఆంటోన్ గ్రీజ్మన్ రెండు కీలక గోల్స్ చేసి, బార్కాపై అట్లెటికో మాడ్రిడ్‌ను సెమీ ఫైనల్స్ చేర్చాడు. రెండు సెమీస్‌లో కలిసి అట్లెటికో మాడ్రిడ్ సగటున 3-2 తేడాతో గెలిచింది. మ్యాచ్ ప్రథమార్ధంలో అద్భుతమైన హెడర్‌తో మొదటి గోల్ చేశాడు. ఈ గోల్ లభించిన వెంటనే అట్లెటికో మాడ్రిడ్ వ్యూహాత్మకంగా డిఫెన్స్‌కు దిగిపోగా, దాడికి దిగాల్సిన బార్సిలోనా ఆచితూచి ఆడే క్రమంలో ఎంతో విలువైన సమయాన్ని వృథా చేసుకుంది. లియోనెల్ మెస్సీ, నేమార్, లూయిస్ సౌరెజ్ వంటి ప్రపంచ మేటి ఆటగాళ్లు కూడా అనూహ్యంగా రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. ఫలితంగా బార్సిలోనాకు ఒక్క గోల్ కూడా లభించలేదు. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏమరుపాటును సద్వినియోగం చేకున్న గ్రీజ్మన్ ద్వితీయార్థంలో మరో గోల్ సాధించాడు. రెండు గోల్స్ ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత అట్లెటికో మాడ్రిడ్ తనదైన వ్యూహాన్ని అనుసరించి, రక్షణ వలయాన్ని మరింత బలోపేతం చేసింది. ఫలితంగా బార్సిలోనా మ్యాచ్ ముగిసే వరకూ ఒకక గోల్ కూడా చేయలేకపోయింది.
ఇలావుంటే, పారిస్ జెయింట్స్ జెర్మైన్‌ను సగటున 3-2 గోల్స్ తేడాతో ఓడించిన మాంచెస్టర్ సిటీ సెమీస్ చేరింది. ఇదే తేడాతో బెన్ఫికాపై బయెన్స్ మ్యూనిచ్, ఊల్ఫ్స్‌బర్గ్‌పై రియల్ మాడ్రిడ్ జట్లు విజయాలను నమోదు చేసి సెమీస్‌లోకి అడుగుపెట్టాయి.