క్రీడాభూమి

విజయం ఎవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య శుక్రవారం జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిని రేపుతోంది. కోల్త్ నైట్ రైడర్స్‌తో జరిన మ్యాచ్‌లో డేర్‌డెవిల్స్ ఘోర పరాజయాన్ని ఎదుర్కోగా, గుజరాత్ లయన్స్‌తో తలపడిన పంజాబ్ కూడా ఓటమిపాలైంది. గత ఐపిఎల్‌లో డేర్‌డెవిల్స్, పంజాబ్ జట్లు కింద నుంచి మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. భారత అండర్-19 జట్టు కోచ్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మెంటర్‌గా, పాడీ అప్టాన్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీకి 37 ఏళ్ల జహీర్ ఖాన్ నాయకత్వం వహిస్తున్నాడు. అతని అపరమైన అనుభవం డేర్‌డెవిల్స్‌కు అండగా నిలవనుంది. ఇటీవల ముగిసిన టి-20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ వేసిన చివరి ఓవర్ మొదటి మూడు బంతులను సిగ్సర్లు మార్చి, అసాధ్యంగా కనిపించిన విజయాన్ని సులభసాధ్యం చేసిన కార్లొస్ బ్రాడ్‌వెయిట్ మీద అభిమానులు పెట్టుకున్న ఆశలు మొదటి మ్యాచ్‌లో నీరుగారిపోయాయి. అతను పంజాబ్‌పై ఏ విధంగా రాణిసాతడో చూడాలి. క్వింటన్ డికాక్ (15), సంజా శాంసన్ (15) తప్ప ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. బౌలింగ్ విభాగానికి వస్తే జహీర్‌తోపాటు నాథన్ కౌల్టర్ నైల్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రా కీలక పాత్రను పోషించాల్సి ఉంది. ఈసారి ఐపిఎల్ వేలంలో భారత ఆటగాళ్లందరిలోకి అత్యధిక ధరను పొందిన పవన్ నేగీ నిరాశ పరిచాడు. అతను కూడా మళ్లీ ఫామ్‌లోకి రావాలి.
గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన జార్జి బెయిలీని తప్పించడమేగాక, అతనిని జట్టు నుంచి రిలీజ్ చేసిన పంజాబ్ మేనేజ్‌మెంట్ నాయకత్వం పగ్గాలను డేవిడ్ మిల్లర్‌కు అప్పగించింది. మురళీ విజయ్, మానన్ వోహ్రా వంటి మేటి బ్యాట్స్‌మెన్ ఈ జట్టులో ఉన్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే మిచెల్ జాన్సన్, మార్కస్ స్టొయినిస్ ముఖ్యభూమికను పోషించాల్సి ఉంటుంది. గ్లేన్ మాక్స్‌వెల్ రూపంలో ఆ జట్టుకు సమర్థుడైన ఆల్‌రౌండర్ ఉన్నాడు. మొత్తం మీద గత ఐపిఎల్‌లో విఫలమై, ఈసారి తమతమ మొదటి మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదర్కొన్న డేర్‌డెవిల్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగే పోరు ఆసక్తిని రేపుతోంది.