క్రీడాభూమి

మాకే విజయావకాశాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 14: గడిచిన మూడు మ్యాచ్‌లలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న తమ జట్టు మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచేందుకు అపార అవకాశాలు ఉన్నాయని రాజస్తాన్ రాయల్స్ టీమ్ క్రికెటర్ ధవల్ కులకర్ణి అన్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిపై గెలుపు ద్వారా ప్లే ఆఫ్‌లో బెర్త్ కోసం అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని ఆయన పేర్కొన్నాడు. ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. మంగళవారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో జరుగుబోయే మ్యాచ్‌లో రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించగలమనే ధీమాను ఆయన వ్యక్తం చేశాడు. తమ టీమ్ గత మూడు మ్యాచ్‌లలో వరుస విజయాలను నమోదు చేసుకోవడం వెనుక కెప్టెన్ అజింక్య రహానే సమష్టి నిర్ణయంతోపాటు హెడ్ ఆఫ్ క్రికెటర్ జుబిన్ బరూచా, మెంటర్ షేన్ వార్న్, బ్యాటింగ్ కోచ్ అమోల్ మజుందార్ కృషి ఎంతో ఉందని ఆయన అన్నాడు.