క్రీడాభూమి

న్యూజిలాండ్ బాక్సర్ గోల్డ్ మెడల్ చోరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, మే 14: న్యూజిలాండ్ బాక్సర్ సాధించిన గోల్డ్ మెడల్ చోరీకి గురైంది. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో హెవీవెయిట్ విభాగంలో 22 ఏళ్ల న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ నరుూకా గోల్డ్ మెడల్ సాధించాడు. ఆక్లాండ్‌లో ఈ గోల్డ్ మెడల్ చోరీకి గురైనట్టు గుర్తించానని ఆయన పేర్కొన్నాడు. కామనె్వల్త్‌లో మెడల్ సాధించిన తర్వాత ఆక్లాండ్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పిల్లలకు చూపించేందుకు వెళ్తుండగా కారునుంచి అదృశ్యమైనట్టు గమనించానని ఆయన తెలిపాడు. తాను ఎంతో కష్టపడి ఆ గోల్డ్ మెడల్‌ను సాధించానని, అది తప్పకుండా తనకు చేరుతుందనే విశ్వసిస్తున్నానని ఆయన పేర్కొన్నాడు. కాగా, డిటెక్టివ్ సర్జంట్ పాల్ స్లాటర్ మాట్లాడుతూ జరిగిన సంఘటనపై కేసు నమోదు చేశామని, సంఘటన స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీంచి, నిందితులను పట్టుకుంటామని అన్నాడు. కాగా, ఈ న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ నరుూకా 2014 గ్లాస్‌గోవ్ కామనె్వల్త్ గేమ్స్‌లో లైట్ హెవీవెయిట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత గోల్డ్ కోస్ట్‌లో హెవీవెయిట్ విభాగంలో మరో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.