క్రీడాభూమి

బెంగళూరులో ఐపిఎల్ ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కరవుతో అల్లాడుతున్న మహారాష్టన్రుంచి 13 ఐపిఎల్ మ్యాచ్‌లను వేరే చోటికి మార్చాలన్న ముంబయి హైకోర్టు ఆదేశం తర్వాత తన షెడ్యూల్ అంతా ఒక్కసారిగా కకావికలు కావడంతో ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌కి వేదికగా ముంబయికి బదులు బెంగళూరును ఎంపిక చేసుకోవడంతో పాటు హైకోర్టు తీర్పు కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి చెందిన ప్రాంచైజీలకు నాలుగు ప్రత్యామ్నాయ హోమ్ ఆప్షన్లను ఇచ్చింది. ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ జట్ల ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలోఐపిఎల్ ఫైనల్, తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లను బెంగళూరుకు కేటాయించాలని నిర్ణయించారు. మరోవైపు బొంబాయి హైకోర్టు తీర్పును అమలు చేయడం కోసం రెండో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను కోల్‌కతాకు మార్చాలని ప్రతిపాదించారు. మహారాష్ట్ర తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొంటున్నందున ఏప్రిల్ 30 తర్వాత రాష్ట్రంలో జరిగే అన్ని ఐపిఎల్ మ్యాచ్‌లను వేరే చోటికి మార్చాలని హైకోర్టు బుధవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును(బిసిసిఐ) ఆదేశించిన విషయం తెలిసిందే.
కాగా రాయపూర్, జైపూర్, విశాఖపట్నం, కాన్పూర్‌లలో ఒక దానిని తమ ప్రత్యామ్నాయ హోమ్ వేదికగా ఎంచుకోవాలని హైకోర్టు తీర్పు కారణంగా నష్టపోతున్న పుణె, ముంబయి జట్లను శుక్రవారం జరిగిన సమావేశంలో కోరడం జరిగింది. పుణె జట్టు విశాఖ పట్నంను ఎంచుకోగా, ముంబయి మాత్రం తన కొత్త వేదికను ఎంపిక చేసుకోవడానికి రెండు రోజులు సమయం కోరింది. ఫైనల్, తొలి క్వాలిఫైయర్‌ను బెంగళూరుకు, అలాగే రెండో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను కోల్‌కతాకు మార్చాలని పాలకమండలి ముందు తాము ప్రతిపాదించనున్నట్లు సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాజీవ్ శుక్లా చెప్పారు. ప్రాంచైజీలతో మాట్లాడిన తర్వాత నాలుగు ప్రత్యామ్నాయాలు- రాయపూర్, జైపూర్, కాన్పూర్, విశాఖ పట్నంలను ఇవ్వడం జరిగిందని, తమ ప్రాధాన్యతను తెలియజేయడానికి ముంబయి ఎల్లుండిదాకా టైమ్ అడిగిందని ఆయన చెప్పారు. పుణె తన ప్రిఫరెన్స్‌గా విశాఖపట్నంను ఇచ్చిందని ఆయన చెప్తూ పుణె జట్టు ప్రతిపాదనను గవర్నింగ్ కౌన్సిల్ ముందుంచుతామని తెలిపారు. ఐపిఎల్ ప్రాంచైజీలు ముంబయి, పుణెలు ముఖ్యమంత్రి కరవు సహాయ నిధికి చెరి అయిదు కోట్ల రూపాయలు ఇస్తాయని బిసిసిఐ హైకోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ మహారాష్టల్రో మ్యాచ్‌లు నిర్వహించడానికి ఇతర సమస్యలు తలెత్తాయి. 5 కోట్లు ఇవ్వడం అనేది హైకోర్టు ఆదేశాల మేరకు ఉంటుందని, దీనికి సంబందించి వాటికి లిఖితపూర్వక ఆదేశాలు రావచ్చని శుక్లా చెప్పారు. కాగా, ముంబయిలో ఈ నెల 29న హోం ఫ్రాంచైజీ ముంబయి ఒక మ్యాచ్ ఆడుతున్నందున మే 1న ముంబయి, పుణె మధ్య జరగాల్సిన మ్యాచ్‌ని పుణెలో యధావిధిగా నిర్వహించడానికి అనుమతించాలని బిసిసిఐ హైకోర్టును కోరుతుందని కూడా శుక్లా చెప్పారు. ముఠా తగాదాల కారణంగా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను బిసిసిఐ నిషేధించినప్పటికీ ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వంనుంచి ప్రతిపాదన వచ్చినందున ఐపిఎల్ మ్యాచ్‌లకు జైపూర్ వేదిక అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు.
కాల్పుల్లో క్రికెటర్ మృతి
జమ్మూ-కాశ్మీరులో విషాదం
శ్రీనగర్, ఏప్రిల్ 15: జమ్మూ-కాశ్మీరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. హంద్వారాలో జరిగిన కాల్పుల్లో కాశ్మీరు జింఖానా క్లబ్ క్రికెట్ జట్టుకు చెందిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ నరుూమ్ భట్ మృతిచెందాడు. ఒక పాఠశాల విద్యార్థినిపై సైనికుడు అత్యాచారం జరిపాడన్న పుకార్లు వెలువడటంతో స్థానిక యువకులు ఆందోళనకు దిగి సైనిక పోస్టుపై రాళ్లు రువ్వారు. అయితే తనపై ఎవరూ అత్యాచారం జరపలేదని సదరు బాలిక ఆ పుకార్లకు తెరదించేలోపే ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సైనికులతో పాటు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నరుూమ్ భట్ తన సెల్‌ఫోనులో ఆ దృశ్యాన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే సైనికులు జరిపిన కాల్పుల్లో నరుూమ్ భట్ సహా ఇద్దరు చనిపోయారు. కాశ్మీరు జింఖానా క్లబ్ జట్టుకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా సేవలు అందిస్తున్న నరుూమ్ భట్ ఇప్పటికే పలు టోర్నీలో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలవడంతో పాటు ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా మూడేళ్ల క్రితం అతను కుప్వారా నుంచి జాతీయ స్థాయిలో అండర్-19 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. గత ఐదేళ్ల నుంచి తమ జట్టులో అద్భుతంగా రాణిస్తున్న నరుూమ్ మృతిచెందాడంటే నమ్మలేకపోతున్నామని జింఖానా క్లబ్ జట్టు కెప్టెన్ మన్సూర్ విచారాన్ని వ్యక్తం చేశాడు.
పాక్ క్రికెట్ జట్టుకు
త్వరలో తాత్కాలిక కోచ్
పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ వెల్లడి
కరాచీ, ఏప్రిల్ 15: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు దీర్ఘకాలిక కోచ్‌గా సేవలు అందిస్తున్న వకార్ యూనిస్‌ను తొలగించి ఆ పదవిలో మరొకరిని నియమించేందుకు ముమ్మర అనే్వషణ కొనసాగిస్తున్న పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లబోతున్న జాతీయ జట్టుకు తాత్కాలిక కోచ్‌ను నియమించే అవకాశాలను పరిశీలిస్తోంది. బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ లాహోర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. జట్టుకు కొత్త ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసేందుకు స్వదేశీ, విదేశీ అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నప్పటికీ దీనిపై ఇంకా తుది నిర్ణయం జరగలేదని చెప్పాడు. అయితే వచ్చే జూన్-ఆగస్టు నెలల్లో పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నందున ప్రస్తుతానికి కొంత కాలం పాటు తాత్కాలిక కోచ్‌ను నియమించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు.
అయితే పాక్ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలు అందించేందుకు ఆసక్తితో ఉన్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని, ఈ దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాలో మిగిలిన అభ్యర్థులకు మే నెల మొదటి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని భావిస్తున్నామని ఇంతకుముందు పిసిబి స్పష్టం చేయడంతో ప్రస్తుతం షహర్యార్ చేసిన ప్రకటన గందరగోళాన్ని రేపుతోంది. ఇదిలావుంటే, కొత్త కోచ్ నియామకాన్ని ఆమోదించాల్సిన కమిటీలో సభ్యులుగా ఉన్న పాక్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, రమీజ్ రాజా ఇప్పటికే ఈ విషయమై ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ, డీన్ జోన్స్ లాంటి ఆశావహులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.